భర్తను హతమార్చి.. స్నేహితులతో కలిసి రెండు రోజుల పాటు పార్టీ
Viral News: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. ఏం జరిగిందో ఏమో.. భర్తను దారుణంగా హతమార్చింది. ఏమీ తెలీనట్లు దుస్తులు మార్చుకుని ఫ్రెండ్స్ ఇంటికి పార్టీకి వెళ్లింది. పోలీసులు వచ్చి చూసేసరికి ఆ వ్యక్తి మృతదేహం కుళ్లిపోయింది. ఢిల్లీకి చెందిన సచిన్ రానా 22 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. గత వారం ఆ యువతి నీట్‌గా దుస్తులు వేసుకుని పార్టీ నిమిత్తం తన స్నేహితురాళ్ల ఇంటికి వెళ్లింది.
ఆమె నివసిస్తున్న ఇంటి నుంచి వాసన వస్తుండడంతో చుట్టు పక్కల వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు వచ్చి తలుపుకి ఉన్న తాళం పగలగొట్టి చూసే సరికి సచిన్ రానా మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది. సీసీటీవీ కెమెరా పరిశీలించగా.. అతని భార్య పార్టీ దుస్తులు వేసుకుని బయటికి వెళ్తున్నట్లు కనిపించింది. ఆమె ఎక్కడికి వెళ్లింది అని పోలీసులు విచారించగా.. రెండు రోజుల పాటు స్నేహితుల ఇంట్లో పార్టీ చేసుకుంటే ఉందట. దాంతో ఆమె ఆచూకీని కనిపెట్టి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎందుకు చంపిందో మాత్రం ఇప్పటివరకు నోరు మెదపలేదట.