Hyderabad: కుమారుడి పుట్టినరోజు చేయలేద‌ని భార్య ఆత్మహత్య

Hyderabad: హైద‌రాబాద్ శివారులోని పెట్ బషీరాబాద్ ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక‌ సుభాష్ నగర్‌కు చెందిన‌ నరసింహారెడ్డి, నాగ సత్యవేణి అనే దంపతుల చిన్న కుమారుడు జ్ఞానేశ్వర్ పుట్టినరోజుకు బంగారు గొలుసు చేయించి వేడుకలు చేద్దామని స‌త్య‌వేణి న‌ర‌సింహారెడ్డిని కోరగా.. తర్వాత చూద్దామనడంతో మనస్థాపనికి గురై ఆమె ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.