భర్త బతికుండగానే విదవగా మారిన భార్య.. హైకోర్టు తీర్పు ఏంటి?
Husband: కాలు జారి కిందపడి కోలుకుంటున్న భర్తకు సేవ చేయాల్సిందిపోయి బతికున్నా చనిపోయినట్లే అనుకుని ఓ మహిళ విదవగా మారింది. తాను బతికుండగానే తాళికట్టిన భార్య కళ్ల ముందు విదవగా తిరుగుతుంటే ఆ భర్తకి ఇంతకుమించిన నరకం మరొకటి ఉంటుందా? ఈ కేసుపై ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పు ఇచ్చింది?
ఢిల్లీకి చెందిన ఓ జంట 2009లో వివాహం చేసుకున్నారు. 2011లో వీరికి ఓ కూతురు పుట్టింది. పాప పుట్టిన కొన్ని రోజులకే ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇంటి పనులు చూసుకోవడానికి ఆ వ్యక్తికి ఎంతో కష్టమైంది. ఆ వ్యక్తి తండ్రే కొన్ని పనులు చేసి పెట్టేవాడు. అయితే ఓసారి భర్త ఇంట్లో కాలు జారి పడిపోయాడు. అతనికి తీవ్రంగా గాయం అవడంతో వైద్యులు కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు.
అయితే అప్పటికే ఇంటికి వచ్చిన భార్య భర్తకు అనారోగ్యంగా ఉంటే చూసుకోవాల్సిందిపోయి నదుటన కుంకుమ, గాజులు తీసేసి తెల్ల చీర కట్టుకుని తన భర్త చనిపోయినట్లుగా విదవగా మారిపోయింది. బయటికి కూడా అలాగే వెళ్తుండడంతో ఆ భర్త తట్టుకోలేక తనకు విడాకులు కావాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో వాదోపవాదాలు విన్న హైకోర్టు జడ్జిలు ఓ భర్తకు తాను బతికుండగానే భార్య విదవగా తిరగడాన్ని చూసి తట్టుకోవడం కంటే మరో నరకం ఉండదని చెప్తూ ఇద్దరికీ విడాకులు మంజూరు చేసారు. ఇలాంటి మహిళల వల్ల సమాజానికి మచ్చ వస్తోందని మండిపడ్డారు.