వీపు రుద్దమన్నందుకు భర్తను రాడ్‌తో కొట్టిన భార్య
Wife: స్నానం చేస్తుండగా వచ్చి వీపు రుద్దు అన్నందుకు భర్తపై భార్య రాడ్డుతో దాడి చేసింది. కేపీహెచ్‌బీలో ఉండే శివ అనే వ్యక్తి స్నానం చేస్తూ తన వీపు రుద్దాలని భార్యపై గట్టిగా అరిచాడు. దీంతో అరవకండి చుట్టూ ఉన్నవాళ్లు వింటే బాగోదు అని భార్య చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి భార్య పక్కనే ఉన్న రాడ్డుతో శివ తలపై కొట్టింది. తలకు తీవ్ర గాయం అవ్వడంతో శివ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనపై దాడి చేసిన భార్యపై కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్లో శివ ఫిర్యాదు చేశాడు.