Gandhi Jayanthi: “అందుకే మూడు సార్లు తుపాకీతో కాల్చాను”
Gandhi Jayanthi: జాతిపిత మహాత్మా గాంధీని.. నథూరాం గాడ్సే తుపాకీతో కాల్చి చంపాడన్న విషయం యావత్ భారత దేశానికీ తెలుసు. అయితే.. గాడ్సే ప్లాన్ ప్రకారం గాంధీని రెండు సార్లు మాత్రమే తుపాకీతో కాల్చి చంపాలని ప్లాన్ చేసారట. కానీ గాడ్సే మాత్రం మూడు సార్లు కాల్పులు జరిపారు. ఇలా ఎందుకు జరపాల్సి వచ్చిందో గాడ్సే విచారణలో వెల్లడించాడు. ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా గాడ్సే మన జాతిపితను ఎందుకు పొట్టనబెట్టుకోవాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
అది 1948 జనవరి 30.. దేశ విభజన కారణంగా హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇందుకు కారణం గాంధీనే అని చాలా మంది గాంధీపై గుర్రుగా ఉన్నారు. గాంధీ న్యూ ఢిల్లీలో ఉండగా.. దేశంలో జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయలేక అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌లు రాజీనామా చేసేయాలని నిర్ణయించుకున్నారు. జనవరి 30 సాయంత్రం 5 గంటల సమయంలో గాంధీ తన ప్రేయర్ మీటింగ్ నిమిత్తం తన గది నుంచి బయటికి వచ్చారు. ఆ సమయంలో తనతో పాటు తన మేనకోడళ్లైన అవా బెన్, మను బెన్‌లు కూడా ఉన్నారు.
గాంధీ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. కానీ గాంధీ ఎప్పుడు బయటికి వచ్చినా భద్రతా దళాలు ఎక్కువగా ఉండేవి. కానీ జనవరి 30 సాయంత్రం ప్రాంతంలో మాత్రం గాంధీకి ఉండాల్సిన సెక్యూరిటీ లేదు. ప్రేయర్ మీటింగ్‌కి వెళ్తున్న సమయంలో తన అసిస్టెంట్ అయిన గుర్బచన్ సింగ్‌తో మాట్లాడాలని ఆ జనాల మధ్య కాసేపు ఆగారు. ఆ తర్వాత అక్కడి జనాలకు అభివాదం చేస్తుండగా.. అదే గుంపులో ఉన్న నథూరాం గాడ్సే మెల్లిగా గాంధీ ముందుకు వెళ్లి మూడు సార్లు కాల్పులు జరిపాడు. దాంతో గాంధీ కుప్పకూలిపడిపోయారు. ఆయన చివరి శ్వాస సమయంలో హే రాం అంటూ కన్నుమూసారు.
ఆ సమయంలో అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం. అంతా షాక్‌లో ఉన్న సమయంలో గాడ్సే పారిపోవాలనుకోలేదు. తనతంట తనే పోలీసులను పిలిచి అరెస్ట్ చేయండి అని చెప్పాడట. గాంధీని చంపడానికి గాడ్సే బెరెట్టా 606824 పిస్టల్ వాడాడు. దీనిని మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కి చెందిన నారాయణ్ ఆప్టే అనే గన్ డీలర్ నుంచి కొనుగోలు చేసాడు. గాంధీని మరో రెండు రోజుల్లో చంపుతాం అనగా గాడ్సే ఈ తుపాకీని కొనుగోలు చేసాడు. గాడ్సే మూడు బుల్లెట్లను గాంధీ శరీరంలో దించగా.. ఒక బుల్లెట్ కుడి ఛాతికి మిగతా రెండు బుల్లెట్లు కడుపులో నుంచి బయటికి చొచ్చుకొచ్చాయి. అదే గాంధీ మరణానికి కారణమైంది.
విచారణ సమయంలో గాడ్సే గాంధీ గురించి ఇలా చెప్పారు. “” నేను గాంధీ దగ్గరికి గౌరవంతో వెళ్లలేదు. తుపాకీతో కాలిస్తే మిస్సవ్వకూడదని దగ్గరగా వెళ్లా. పిస్తోల్ సేఫ్టీ క్యాచ్ తీసి దగ్గర్నుంచి గాంధీని కాల్చాలనుకున్నా. నా టార్గెట్ గాంధీ మాత్రమే. అక్కడున్న జనాలకు ఏమీ కాకూడదు. రెండుసార్లు కాల్చాక నాలో ఉత్సాహం ఉప్పొగింది. దాంతో మూడోసారి కూడా గుండు దింపా. గాంధీని చంపానన్న ఆనందంతో నేనే పోలీసులను పిలిచా “” అని వెల్లడించాడట. అక్కడే ఉన్న గార్డు గాడ్సే తలపై కొట్టినప్పుడు గాడ్సే వెనక్కి కూడా నువ్వు నా తల పగలగొట్టినా నేను ఇలాగే స్థిరంగా నిలబడతా అని అన్నాడట.