USA: భారతీయ యువతి కోసం FBI ఎందుకు వెతుకుతోంది? పట్టిస్తే పదివేల డాలర్లు!
USA: భారత సంతతికి చెందిన యువతి కోసం అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ సంస్థ గాలిస్తోంది. ఈమె పేరు అమెరికాలో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉంది. ఈ యువతిని పట్టిస్తే పదివేల డాలర్లు ఇస్తామని ప్రకటన విడుదల చేసారు. ఇంతకీ FBI ఎందుకు ఈమె కోసం వెతుకుతోంది?
పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు మాయుషి సింగ్. వయసు 28. 2016లో అమెరికాకు వెళ్లి స్థిరపడింది. 2019 మే 1న మాయుషి కనిపించకుండా పోయింది. చివరి సారిగా మాయుషి 2019 ఏప్రిల్‌లో న్యూజెర్సీలో కనిపించిందట. స్టూడెంట్ వీసాపై చదువుకోవడానికి అమెరికా వెళ్లిన మాయుషి ఎందుకు కనిపించకుండాపోయందో ఎవ్వరికీ తెలీదు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె చదువుతున్న యూనివర్సిటీలో అడిగినా అసలు రావడం మానేసిందని చెప్తున్నారట. దాంతో ఇండియాలో ఉంటున్న మాయుషి తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రాణాలతో రావాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.