Ayodhya: ఈ ముస్లిం మహిళ అయోధ్యకు ఎందుకు కాలినడకన వెళ్తోంది?
Ayodhya: అయోధ్య రామమందిరాన్ని చూడాలని భారతీయులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రామయ్యను అయోధ్యలో దర్శించుకోవాలని హిందువులకు ఎంతో ఆతృతగా ఉండటం సహజమే. కానీ పై ఫోటోలో కనిపిస్తున్న ముస్లిం మహిళ కూడా రామయ్య దర్శనం చేసుకోవాలనుకుంటోంది. అయితే అందరిలా కాకుండా తాను ఉంటున్న ముంబై నుంచి తన ఇద్దరు స్నేహితులతో కలిసి కాలినడకన అయోధ్యకు బయలుదేరింది. ఇది కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే..!
ఆ యువతి పేరు షబ్నమ్. ముంబైలో ఉంటోంది. ఆమె ముస్లిం అయినప్పటికీ రాముడంటే ఎంతో భక్తి. అయోధ్యలో రామమందిరం నిర్మితం అవ్వాలని గొంతుక వినిపించినవారిలో షబ్నమ్ కూడా ఒకరు. ప్రస్తుతానికి షబ్నమ్ కాలినడకన మధ్యప్రదేశ్‌లోని సింధవ ప్రాంతానికి చేరుకుంది. కుల మత బేధాలు లేకుండా రాముడు అందరివాడు అని షబ్నమ్ అంటోంది. కాలినడకన అబ్బాయిలే కాకుండా అమ్మాయిలు కూడా ధైర్యంగా వెళ్లొచ్చని అలా వెళ్లాలనుకునేవారికి తానే స్పూర్తి అని తెలిపింది.