Indian Foods: మన ఆహార పదార్థాలను ఆ దేశాల్లో ఎందుకు బ్యాన్ చేసారు?
Indian Foods: మన భారతదేశంలో ఎంతో పాపులర్ అయిన కొన్ని ఆహార పదార్థాలను కొన్ని విదేశాల్లో బ్యాన్ చేసారు. దాదాపు 4 రకాల ఆహార పదార్థాలను బ్యాన్ చేసారు. ఆ పదార్థాలేంటి.. ఎందుకు బ్యాన్ చేసారో తెలుసుకుందాం.
సమోసా (samosa)
ఈ సమోసా అనేది విదేశాల్లో వివాదానికి మారు పేరుగా చూస్తున్నారు. మన భారతీయులకేమో సమోసా అంటే ఎంతో ఇష్టం. సోమాలియా దేశంలో సమోసాలను 2011లోనే బ్యాన్ చేసారు. ఇందుకు కారణం సమోసా త్రికోణ ఆకారంలో ఉండటమే. ఈ త్రికోణ గుర్తు అల్ షబాబ్ అనే క్రైస్తవుల గుర్తుగా పరిగణిస్తారట. అందుకే ఆ ఆకారంలో ఉండే సమోసాలను బ్యాన్ చేసేసారు. ఒకవేళ అక్కడ ఎవరైనా సమోసా తిన్నట్లు కానీ తయారు చేస్తున్నట్లు కానీ తెలిసినా చర్యలు కఠినంగా ఉంటాయి.
నెయ్యి (ghee)
మనం దాదాపు రోజూ ఏదో ఒక సందర్భంలో నెయ్యి వాడుతూనే ఉంటాం. కానీ అమెరికాలో నెయ్యిని నిషేధించారు. నెయ్యి వల్ల గుండెపోటు, స్థూలకాయం, అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయని తెలిసి అక్కడి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నెయ్యిని బ్యాన్ చేసింది.
కెచప్ (ketchup)
కెచప్ దాదాపు అన్ని హోటళ్లలో అమ్ముతుంటారు. కానీ ఫ్రాన్స్‌లో దీనిపై నిషేధం ఉంది. కెచప్‌ని అమెరికన్లు కనిపెట్టారని వారి ఆహారాన్ని ఫ్రాన్స్‌లో వాడాల్సిన అవసరం లేదని కఠిన రూల్ పెట్టింది.
చ్యవన్‌ప్రాశ్ (chyawanprash)
రోగనిరోధక శక్తిని పెంచే చ్యవన్‌ప్రాశ్‌ను కెనడాలో 2005లో బ్యాన్ చేసారు. ఇందులో లెడ్, మెర్క్యూరీ లెవెల్స్ అధికంగా ఉన్నాయని వారి పరిశోధనల్లో తేలిందట.