Bethlehem: ఏసుక్రీస్తు పుట్టిన ప్రాంతంలో మాత్రం నో క్రిస్మస్.. ఎందుకు?
Bethlehem: ప్రపంచమంతా ఈరోజు క్రిస్మస్ వేడుకలను అంబరాన్నంటేలా జరుపుకున్నారు. కానీ ఏసుక్రీస్తు పుట్టిన బెత్లెహెంలో మాత్రం అసలు పండగే లేదు. దీనికి కారణం ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్న యుద్ధమే. ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న వెస్ట్ బ్యాంక్‌లో ఉంది ఈ బెత్లెహెం. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎప్పుడూ లక్షలాది మంది టూరిస్ట్‌లతో కళకళలాడే ఈ ప్రదేశం నేడు బోసిపోయింది.
ఈ ఏడాది తమ జీవితాల్లోనే వరస్ట్ క్రిస్మస్ అని స్థానికులు బాధపడుతున్నారు. ఈసారి యుద్ధం కారణంగా ఒక్క క్రిస్మస్ చెట్టు కూడా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యుద్ధం ఆగిపోయి కనీసం న్యూ ఇయర్ వేడుకలైనా జరుపుకుంటామో లేదో అని అంటున్నారు.