Telangana Elections: తెలంగాణను TS అని ఎందుకు అంటారు?
తెలంగాణ రాష్ట్రం (telangana elections) ఏర్పడినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని TS అని సంబోధిస్తున్నారు. TS అంటే తెలంగాణ స్టేట్ అని అర్థం. అయితే ఇండియాలోని ఏ రాష్ట్రాన్ని కూడా ఇలా స్టేట్‌ని జోడించి మరీ రాయరు. మరి కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే ఎందుకు ఈ పేరు వచ్చిందో తెలుసుకుందాం.
దీని వెనకాల పెద్ద కథేమీ లేదు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వేరయ్యాక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మీడియా వారంతా పేపర్లలో T స్టేట్ అని అని రాసేవారట. మీడియా సమావేశాల్లో కూడా T స్టేట్ అని సంబోధిస్తుంటే వినడానికి బాలేదని రాసేటప్పుడు TS అని పలికేటప్పుడు తెలంగాణ స్టేట్ అని పలకాలని చెప్పారట. అందుకే వెహికల్ రిజిస్ట్రేషన్‌కు కూడా TS అనే పెట్టేసారు.