ప్రేయసిని రేప్ చేసి 111 సార్లు పొడిచిన వ్యక్తిని పుతిన్ ఎందుకు వదిలేసాడు?
Russia: ప్రేయసిని దారుణంగా రేప్ చేసాడు. అంతటితో వదలకుండా 111 సార్లు పొడిచి చంపేసాడు. కానీ ఆ వ్యక్తిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (vladimir putin) శిక్ష పడనివ్వకుండా వదిలిపెట్టాడు. ఎందుకు?
పై ఫోటోలో కనిపిస్తున్న అబ్బాయి పేరు కాన్యూస్. ఇతని పక్కనే ఉన్న అమ్మాయి పేరు వెరా. వెరా కాన్యూస్ ప్రేమించుకున్నారు. కానీ ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడిపోయారు. అయితే ఆ కోపంతో కాన్యూస్ వెరాను దారుణంగా అత్యాచారం చేసి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 111 సార్లు పొడిచి చంపేసాడు. ఇతనికి రష్యాలోని స్థానిక న్యాయస్థానం 17 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
కానీ ఇతను ఏడాది కూడా జైల్లో ఉండకుండా బయటపడ్డాడు. అతన్ని బయటకు రప్పించింది పుతినే. ఎందుకంటే.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తానని కాన్యూస్ పుతిన్‌కు తెలియజేసాడట. దాంతో ఇతను జైల్లో ఉండే కంటే. శత్రుదేశంలో పోరాడి చస్తే మేలని పుతిన్ భావించి అతన్ను బయటికి రప్పించాడు.
ఈ విషయం వెరా తల్లి ఓక్సానా బయటపెట్టారు. ఓక్సానాకు కాన్యూస్ మిలిటరీ యూనిఫాంలో ఆయుధం పట్టుకుని ఉన్న ఫోటోలు కనిపించాయట. దాంతో ఆమె గుండె బద్ధలైంది. తన బిడ్డను రాక్షసంగా చంపిన వ్యక్తి శిక్ష అనుభవించకుండా రష్యా కోసం పనిచేస్తున్నాడని తెలిసి ఆమె తల్లడిల్లిపోయింది. తన బిడ్డ చనిపోయినా ఆ బాధను దిగమింగుకుని ప్రాణం ఉన్న శవంలా జీవిస్తోంది.
తన బిడ్డ మరణాన్ని కూడా తట్టుకోగలిగింది కానీ తన బిడ్డ చావుకు కారణమైన వ్యక్తిని శిక్ష పడనివ్వకుండా చేసిన రష్యా చట్టాల పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంతటి నీచమైన చట్టాలను ఎక్కడా చూడలేదని కన్నీరుపెడుతోంది. ఇప్పుడు అతను తనను కూడా చంపేస్తే ఎవరు బాధ్యులు అని పుతిన్‌ను ప్రశ్నిస్తున్నారు. ఒక క్రూరమైన నేరస్తుడికి శిక్ష పడనివ్వకుండా చేసి ఒక ఆయుధాన్ని చేతికి ఇచ్చి యుద్ధానికి ఎలా పంపుతారని మండిపడ్డారు.