RBI: అసలు ఎందుకు వెనక్కి తీసుకుంటున్నారు?
Hyderabad: రూ.2000 వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi) ప్రకటించింది. ఆ నోట్లను ప్రజలు సెప్టెంబర్ 30లోగా బ్యాంకుల్లో మార్చుకోవచ్చని తెలిపింది. ఇక నుంచి కస్టమర్లకు రూ.2000 నోటు ఇవ్వొద్దని రిజర్వ్ బ్యాంక్(rbi).. ఇతర బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అందరికీ ఉన్న సందేహం ఉన్నట్టుండి ఆర్బీఐ రూ.2000ను ఎందుకు విత్డ్రా చేసుకుంటోంది అని 6 ఏళ్ల క్రితం రూ.500, రూ.1000 నోట్లు బ్యాన్ చేసినప్పుడు ఈ రూ.2000 నోట్లను సెక్షన్ 24(1) కింద విడుదల చేసింది ఆర్బీఐ(rbi).
ఆ తర్వాత ఇతర డినామినేషన్స్లో అంటే రూ.100, రూ.200 నోట్లు ఎక్కువగా ముద్రిస్తుండడంతో.. ఈ రూ.2000 నోట్లను రూ.2018-2019 మధ్యలోనే నిలిపివేసారు. ఎందుకంటే చాలా మంది మధ్యతరగతి వాళ్లు పెద్ద మొత్తంలో చెల్లింపులు చేయడానికి రూ.2000 నోట్లు ఎక్కువగా వాడటం లేదు. దాంతో క్లీన్ నోట్ పాలసీ కింద ఆర్బీఐ ఈ రూ.2000 నోట్లను బ్యాన్ చేసింది. క్లీన్ నోట్ పాలసీ అంటే ప్రజలకు మెరుగైన, సెక్యూరిటీ ఫీచర్లు బలంగా ఉండే కరెన్సీ నోట్లు. అయితే ఇప్పుడు మీ వద్ద రూ.2000 ఉంటే వాటిని ఎప్పటిలాగే వాడుకోవచ్చు. కాకపోతే సెప్టెంబర్ 30లోపు వరకే వాటిని వాడుకోవాలి. ఆ తర్వాత వాడటానికి అనుమతి లేదు. ఒకవేళ మీ దగ్గర రూ.2000 నోట్లు మిగిలిపోయి ఉంటే.. కొంత రుసుం చెల్లించి ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఈ రూ.2000 నోట్లను సెప్టెంబర్ తర్వాత ఏం చేస్తారు అన్నదానిపై ఆర్బీఐ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
ఇకపోతే.. రూ.2000 నోట్లను ప్రవేశపెట్టి ఇప్పటికే 5 ఏళ్లు కావొస్తోంది. భారతదేశంలో మొత్తంలో 89% రూ.2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. 2018 మార్చి 31 నాటికే ఈ రూ.2000 నోట్ల విలువ మొత్తం 6.73 లక్షల కోట్లు. ఆ విలువ ఇప్పుడు 3.62 లక్షల కోట్లకు పడిపోయింది.