Mukesh Ambani: అంబానీ దంపతులు ఆ అంతస్తులోనే ఎందుకుంటారు?
Mukesh Ambani: రిలయన్స్ సంస్థల అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీ (Nita Ambani) దంపతులు ముంబైలోని అత్యంత ఖరీదైన బంగ్లా అయిన ఆంటీలియాలో ఉంటారు. ఈ ఆంటీలియా బంగ్లా విలువ రూ.15,000 కోట్లు. ఈ ఆంటీలియా బంగ్లాలో మొత్తం 27 అంతస్తులు ఉన్నాయి. 2012లో ముఖేష్ అంబానీ దంపతులు ఈ ఆంటీలియాలోకి వచ్చారు. అప్పట్లోనే దీని విలువ రూ.15,000 కోట్లు. ఇక ఇప్పుడ దీని విలువ ఎంతకాదన్నా రరూ.30,000 కోట్ల వరకు ఉండచ్చు.
అయితే 27 ఫ్లోర్లు ఉన్న ఈ బిల్డింగ్‌లో నీతా, ముఖేష్‌లు 26వ అంతస్తులోనే ఉంటారట. 26 అంతస్తులో అయితే వెలుతురు, గాలి బాగా వస్తాయని.. నివసించే ప్రదేశంలో వెంటిలేషన్ బాగా ఉండాలని నీతా చెప్పడంతోనే కింద నుంచి మకాం పైకి మార్చారట. కేవలం ఇంట్లో వారికి అత్యంత సన్నిహితులకు మాత్రమే 26వ అంతస్తులోకి ఎంట్రీ ఉంటుంది.
ఈ భవనం 37000 చదరపు అడుగుల్లో 173 మీటర్ల పొడవున నిర్మించారు. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ దీవి పేరు ఆంటీలియా. అందుకే ఈ ఇంటికి కూడా ఆంటీలియా అని పేరు పెట్టారు. ఈ భవనంలో 3 హెలీప్యాడ్స్ ఉన్నాయి. మల్టీ స్టోరీ కారు పార్కింగ్ ఉన్నాయి.