మ‌న క‌రెన్సీపై గాంధీ బొమ్మ ఎందుకు న‌వ్వుతూ ఉంటుందో తెలుసా?

why mahatma gandhi keeps laughing on our currency

Mahatma Gandhi: మన భార‌తీయ క‌రెన్సీ నోట్ల‌పై మ‌హాత్మా గాంధీ బొమ్మ న‌వ్వుతూ ఉంటుంది. ఇలా ఎందుకో తెలుసా?  నిజానికి దీని వెనుక పెద్ద క‌థేమీ లేదు. ఎవ‌రైనా ఫోటోల్లో న‌వ్వుతూ ఉండాల‌నే కోరుకుంటారు కానీ బాధ‌పడుతూ ఉండాల‌ని అనుకోరు క‌దా. అయితే ఇదే ప్ర‌శ్న‌ను ఓ స్కూల్లో ప్ర‌శ్న‌గా వ‌చ్చింది. దీనికి ఓ విద్యార్థి రాసిన స‌మాధానం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఇంత‌కీ ఆ విద్యార్థి ఏమ‌ని స‌మాధానంగా రాసాడో తెలుసా? గాంధీ తాత ఎందుకు న‌వ్వుతూ ఉంటారంటే.. ఏడుస్తూ ఉంటే నోట్లు త‌డిసిపోతాయి కాబ‌ట్టి అని రాసాడ‌ట‌. దాంతో ఆ టీచ‌ర్ క‌డుపుబ్బా న‌వ్వుకుంద‌ట‌. ఈ విష‌యాన్ని ఆ టీచ‌రే సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది.