Covid: కొత్త వేరియంట్ కలవరం.. డిసెంబర్‌లోనే ఎందుకు?
Covid: కోవిడ్ పూర్తిగా తగ్గిపోయింది అని అనుకుంటున్న ప్రతీసారి న్యూఇయర్ లాగా న్యూ వేరియంట్ పుట్టుకొచ్చేస్తోంది. ఆల్రెడీ కేరళలో వెయ్యికిపైగా కేసులతో అక్కడి ప్రజలు సతమతమవుతున్నారు. ఒకరు మరణించారని కూడా వైద్యులు చెప్తున్నారు. అయితే ఈ కోవిడ్ వేరియంట్ అనేది కేవలం డిసెంబర్‌లోనే ఎందుకు వస్తున్నట్లు? దీని వెనకున్న కారణాలేంటి?
ఇప్పుడు వ్యాప్తిస్తున్న కొత్త వేరియంట్ పేరు JN.1. ఎయిర్‌పోర్టుల వద్ద మళ్లీ కోవిడ్ రూల్స్ పాటిస్తూ అందరినీ స్క్రీనింగ్ చేసాకే వారిని బయటికి అనుమతించాలని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మైక్రోబయాలజిస్ట్ దాస్ ఆదేశాలు జారీ చేసారు. అయితే డిసెంబర్‌లోనే ఎందుకు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయంటే.. క్రిస్మస్, న్యూ ఇయర్ సమయం కాబట్టి ప్రయాణికులు వివిధ దేశాలకు ప్రయాణిస్తుంటారు కాబట్టి ఈ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుంటాయని అంటున్నారు. అయితే కోవిడ్ 19కి సంబంధించి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చినా కూడా వాటి ప్రభావం అంతగా ఉండదని.. కాకపోతే అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కాకపోతే భారత్‌లో వ్యాక్సిన్ ప్రభావం బాగానే ఉందని.. ఆ వ్యాక్సిన్ వల్లే ఎన్ని వేరియంట్లు వచ్చినా ఎటాక్ చేయలేకపోతున్నాయని వైద్యులు కూడా అభిప్రాయపడుతున్నారు. ముసలివాళ్లు, పిల్లలకు మాత్రం రోగనిరోధక శక్తి ఉండదు కాబట్టి వారిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు.