Viral News: రేప్ కేసు పెట్టిన బాలిక.. కాదు అది సెక్స్ అన్న కోర్టు!
Viral News: తన ప్రియుడు తనపై అత్యాచారం చేసాడని 13 ఏళ్ల బాలిక బొంబాయ్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు కారణం.. అది రేప్ కాదు సెక్స్ అని న్యాయస్థానం బలంగా నమ్మడమే.
నాగ్‌పూర్‌కి చెందిన నితిన్ అనే 26 ఏళ్ల యువకుడు 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసాడు. దాంతో బాలిక తండ్రి న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. వివరాల కోసం బాలికను జడ్జి కొన్ని ప్రశ్నలు వేయగా.. తన ఇష్టంతోనే నితిన్‌తో కలిసి బయటికి వెళ్లానని చెప్పింది. దాంతో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని.. ప్రేమతోనే సెక్స్‌లో పాల్గొన్నారు కానీ కామవాంఛ కోసం ఎలాంటి అత్యాచారం జరగలేదని న్యాయమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో కోర్టు నితిన్‌కు బెయిల్ మంజూరు చేసింది.