Ayodhya: మందిర ప్రారంభోత్సవానికి రావద్దంటున్న అధికారులు.. ఎందుకు?
Ayodhya: భారతదేశ ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ఆల్మోస్ట్ సిద్ధమైపోయింది. 2024 జనవరి 22న రామయ్య విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయనున్నారు. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరుకావాలనుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో (narendra modi) పాటు పలువురు సెలబ్రిటీలు, రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్ (arun govil) కూడా రానున్నారు. అయితే అయోధ్య ఆలయ ట్రస్ట్ సెక్రటరీ చంపట్ రాయ్ మాత్రం భక్తులు ఎవ్వరూ కూడా 22న జరిగే కార్యక్రమానికి రావద్దు అని అంటున్నారు.
ఎందుకంటే ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. అయోధ్య భక్తులకు పూర్తిగా అందుబాటులోకి రావడానికి ఇంకా రెండేళ్ల సమయం పడుతుందని అంటున్నారు. జనవరి 22న రామయ్య ప్రాణ ప్రతిష్ఠను ఆనంద్ మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్నారు. ఇంకా ఆలయ నిర్మాణ పనులు పూర్తి కాలేదు కాబట్టి రద్దీ ఎక్కువ అయితే కట్టడి చేయడం కష్టంగా ఉంటుందని.. కాబట్టి భక్తులు విగ్రహ్ర ప్రాణ ప్రతిష్ఠ రోజున ఎవరి ప్రాంతాల్లో ఉన్న రామాలయానికి వెళ్లి దర్శనం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.