Viral News: అక్కడ ఆడవారు వక్షోజాలను ఎందుకు ఐరన్ చేస్తారు?
Viral News: శిరోజాలను ఐరనింగ్ టూల్‌తో స్ట్రెయిట్ చేయడం గురించి విన్నాం చూసాం. కానీ ఓ దేశంలో ఆడవారు ఏకంగా తమ వక్షోజాలను పొగలు గక్కే ఐరన్ టూల్‌తో దుస్తులను ఇస్త్రీ చేసినట్లు చేస్తారట. ఆ వివరాలేంటో.. వారు అలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుందాం.
ఈ ప్రక్రియను బ్రెస్ట్ ఐరనింగ్ అని అంటారు. ఇది ఎక్కువగా ఆఫ్రికాలోని నైజీరియా, టోగో, గినియా, కెన్యా, జింబాబ్వే దేశాల్లో ఆచారంగా వస్తోంది. అక్కడ ఇలా ఎందుకు చేస్తారంటే.. అమ్మాయిలకు రజస్వల అయ్యాక వారి శరీరంలో పలు మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అలాంటప్పుడు మగవారు వారిని చూసి ఆకర్షితులు అవ్వడం.. వారిపై అత్యాచారాలు వంటివి చేయడం ఆ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా జరుగుతుంటాయి.
పైగా ఆఫ్రికన్ అమ్మాయిలకు సహజంగానే వక్షోజాలు మరీ పెద్దవిగా ఉంటాయి. అందుకే ఆ ఆడపిల్ల బంధువులే ఐరన్ టూల్‌ని బాగా కాల్చి వక్షోజాలపై ఐరన్ చేస్తారు. దాంతో అవి మరీ ఎక్కువగా కనిపించకుండా ఉంటాయి. దీని వల్ల మగవారు వారిని చూసి ఆకర్షితులు అవ్వకుండా ఉంటున్నారని చెప్తున్నారు. బొగ్గులపై ఆకులు, అరటిపండ్లు, కొబ్బరి చిప్పలు, గెరిటలు వంటివి ఎర్రగా కాలుస్తారు. వాటిని వక్షోజాలపై రుద్దుతారు. ఈ ప్రక్రియను అమ్మాయి ఎంత వరకు సహించగలదో అంత వరకు చేస్తారు. అంటే కొన్ని నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇది చేసే సమయంలో మగవారు ఎవ్వరూ కనుచూపు మేరలో ఉండకూడదు.
అయితే ఈ ప్రక్రియ వల్ల వారికి పెళ్లై పిల్లలు పుట్టాక సరిగ్గా చనుబాలు రాకపోవడం.. వక్షోజాల్లో సిస్ట్లు ఏర్పడం.. బ్రెస్ట్ క్యాన్సర్లు రావడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. అయినా సరే.. వీటిని తట్టుకుంటాం కానీ లైంగిక వేధింపులు, అత్యాచారాలు మాత్రం జరగకూడదని ఈ ప్రక్రియను ఫాలో అవుతామని అక్కడి ఆడవారు చెప్తున్నారు. నైజీరియా ప్రభుత్వం ఇలాంటి ప్రక్రియను నేరంగా భావిస్తూ చట్టాన్ని ప్రవేశపెట్టిందే కానీ.. ఎవ్వరూ దీనిని పట్టించుకోవడంలేదు.
ఎలిజబెత్ జాన్ అనే ఓ కెమెరూన్ ప్రాంతానికి చెందిన యువతి పదేళ్ల వయసులోనే వక్షోజాల ఐరనింగ్ చేయించుకుంది. దాంతో ఆమెకు పెళ్లై బిడ్డ పుట్టాక చనుబాలు రాక ఆ బిడ్డ చనిపోయింది. ప్రభుత్వ చట్టాల కంటే తమ సంప్రదాయాలు, విలువలకే ఈ దేశాల్లోని ఆడవారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ ఇంటి ఆడపిల్లలను కాపాడుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తారు.