Marriage: ఇక్కడ కచ్చితంగా 2 వివాహాలు చేసుకోవాల్సిందే..!
Marriage: భారతదేశ వివాహ చట్ట ప్రకారం ఒకసారి మాత్రమే వివాహం చేసుకోవాలి. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నా.. భాగస్వామి చనిపోయిన సందర్భాల్లో రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాంతంలో మాత్రం కచ్చితంగా మగాడు రెండు పెళ్లిళ్లు చేసుకుని తీరాల్సిందే. ఇంతకీ ఏ ప్రాంతంలో ఉందీ ఆచారం అనుకుంటున్నారా? మన దేశంలోని రాజస్థాన్‌లోని (rajasthan) జైసల్మేర్‌లో (jaisalmer) ఉన్న రామ్‌దేవ్ కీ బస్తీ అనే గ్రామంలో ఉంది.
ఈ రామ్ దేవ్ కీ బస్తీ అనే గ్రామంలో కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. వీరికి భారతీయ వివాహ చట్టం అనేది వర్తించదు. తమ ఆచారాన్ని కాదనే హక్కు ఎవ్వరికీ లేదు అని అంటున్నారు. దాంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఈ గ్రామంలో మొత్తం 600 కుటుంబాలు ఉంటున్నాయి. వీరి ఆచారంలో మరో షాకింగ్ విషయం ఏంటంటే.. మొదటి భార్యకు అసలు పిల్లలు పుట్టకూడదు. ఒకవేళ పుడితే కచ్చితంగా ఆడపిల్లే పుట్టాలి. ఈ ఆచారం వల్ల ఈ గ్రామంలో ఆడపిల్లల సంఖ్య పెరిగిపోతోంది. మగవారి సంఖ్య పెద్దగా లేకపోవడంతో వారు రెండేసి పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తోంది. ఇక రెండో భార్య కచ్చితంగా మగపిల్లాడిని కనాల్సిందే.
ఇప్పుడిప్పుడు తరాలు మారుతున్న కొద్ది కొందరు అబ్బాయిలు ఉన్నతంగా ఆలోచించి చదువుకుని వేరే ప్రదేశాల్లో వెళ్లి స్థిరపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇంకా పాద ఆచారాన్నే నమ్ముకుని రెండేసి పెళ్లిళ్లు చేసుకుని పోషించలేక కష్టపడుతున్నారు.