Budget 2024: కొత్త ప‌న్ను విధానంలో మార్పులేంటి? ఎవ‌రికి లాభం?

who will get benefitted from budget tax regime

Budget 2024:  కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌లో భాగంగా కొత్త ప‌న్ను విధానంతో ఎవ‌రికి లాభమో తెలుసుకుందాం.

*మీ వార్షికాదాయం రూ.3 నుంచి రూ.7 ల‌క్ష‌ల మ‌ధ్య ఉన్న‌ట్లైతే పన్ను 5 శాతానికి త‌గ్గింపు. గ‌తంలో ఈ త‌గ్గింపు రూ.6 ల‌క్ష‌ల వ‌ర‌కు వార్షికాదాయం ఉన్న‌వారికి మాత్ర‌మే వ‌ర్తించింది.

*రూ.6 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు వార్షికాదాయం ఉన్న‌వారికి 10% ప‌న్ను వ‌ర్తిస్తుంది.

*రూ. 12 నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు వార్షికాదాయం ఉన్న‌వారికి గ‌త ప‌న్ను విధాన‌మే వ‌ర్తిస్తుంది. అంటే 20% ప‌న్ను వ‌ర్తిస్తుంది.

*రూ.15 ల‌క్ష‌ల‌కు పైగా వార్షికాదాయం ఉన్న‌వారికి 30% ప‌న్ను వ‌ర్తిస్తుంది. ఇందులో కూడా ఏ మార్పూ లేదు.

*వేతనదారులు ఇప్పుడు తమ మొత్తం ఆదాయాన్ని లెక్కించడానికి ముందు వ‌చ్చిన ఆదాయం నుంచి రూ. 75,000ను మైనస్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత మిగిలిన ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది.

*త‌క్కువ ప‌న్ను ప‌డే ఆదాయంపై వేత‌న‌దారులు త‌క్కువ ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ఒక ఉద్యోగి సంవత్సరానికి రూ. 10 లక్షలు సంపాదిస్తే, గతంలో రూ. 50,000 తగ్గింపు తర్వాత రూ. 9.5 లక్షలపై పన్ను లెక్కించాల్సి ఉండేది. ఇప్పుడు రూ. 75,000 తగ్గింపు తర్వాత రూ. 9.25 లక్షలపై మాత్ర‌మే పన్ను లెక్కించాలి.

*వేత‌నాల్లో ప్రామాణిక తగ్గింపు శాతాన్ని పెంచ‌డంతో వేతనదారులకు వారి ఆదాయంలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకునే అవ‌కాశం ఉంటుంది. దీని ద్వారా ఎక్కువ పొదుపు చేసుకోగ‌లుగుతారు.

*ఈ ప్రామాణిక తగ్గింపును పొందేందుకు ఎటువంటి నిర్దిష్ట డాక్యుమెంటేషన్ లేదా ఖర్చుల రుజువులు అవసరం లేదు. ఇది పన్ను చెల్లింపుదారులకు సులభతరం అవుతుంది.

లాభాలు

*పన్ను చెల్లింపుదారులు కొత్త ప‌న్ను విధానంలో రూ. 17,500 వరకు స్వల్ప ఉపశమనం పొందుతారు.

*ఈ మార్పుల వ‌ల్ల‌ రూ. 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి ఎక్కువ ప్రయోజనం. ఎందుకంటే వీరికి ఇప్పుడు తక్కువ పన్ను రేటు వర్తిస్తుంది.

*ఈ మార్పుల ద్వారా సుమారు నాలుగు కోట్ల వేతనదారులు మరియు పించనుదారులు లబ్ధి పొందుతారని అంచనా.