WHO: మరో డేంజరస్ ప్యాండెమిక్ రాబోతోంది!
Hyderabad: ప్రపంచం మరో ప్యాండెమిక్‌గా (pandemic) రెడీగా ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (who) చీఫ్ టెడ్రోస్ వార్న్ చేస్తున్నారు. మరో డేంజరస్ ప్యాండెమిక్ ప్రపంచానికి వణికించడానికి రాబోతోందని తెలిపారు. ఈ ప్యాండెమిక్ కోవిడ్ కంటే భయంకరంగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఇప్పుడు కోవిడ్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కాకపోయినప్పటికీ గ్లోబల్ హెల్త్ థ్రెట్ కాకుండాపోదని స్పష్టం చేసారు. మరో వేరియంట వేరే వ్యాధులను వ్యాపించే సూచనలు కనిపిస్తున్నాయట. 76వ ప్రపంచ హెల్త్ అసెంబ్లీలో టెడ్రో ఈ వ్యాఖ్యలు చేసారు. తదుపరి ప్యాండెమిక్ మన తలుపు తట్టినప్పుడు అప్పటికప్పుడు మేలుకోకుండా ఇప్పటినుంచే దానిని ఎదుర్కోడానికి ప్రిపేర్ అయివుండాలని వివిధ దేశాలకు పిలుపునిచ్చారు. 2030 నాటికి కోవిడ్ నుంచి పుట్టుకొచ్చే ఇతర వేరియంట్లు దాడి చేసే ప్రమాదం ఉందని అన్నారు.