Elon Musk: ప్ర‌పంచంలోనే మొద‌టి ట్రిలియనేర్‌ మ‌స్క్.. భార‌త్ నుంచి ఎవ‌రో తెలుసా?

who is the first indian trillionaire

Elon Musk: టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ సంప‌ద ఏటా 110 శాతం పెరుగుతూనే ఉంది. దాంతో ఆయ‌న ప్ర‌పంచంలోనే తొలి ట్రిలియ‌నేర్‌గా పేరుగాంచారు. ప్ర‌స్తుతం మ‌స్క్ ఆస్తి విలువ 241 బిలియ‌న్ డాల‌ర్లు. మ‌రి మ‌న భార‌త్ నుంచి తొలి ట్రిలియ‌నేర్ ఎవ‌రో తెలుసా? హిండెన్‌బ‌ర్గ్ వంటి రీసెర్చ్ కంపెనీల చేత మాట‌లు ప‌డుతూ.. ఎన్నో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నా ధీటుగా నిల‌బ‌డిన గౌత‌మ్ అదానీ. ఈయ‌న భార‌త్‌లోనే కాదు.. మ‌స్క్ త‌ర్వాత ప్ర‌పంచంలోనే రెండో ట్రిలియ‌నేర్ కావ‌డం హ‌ర్ష‌ణీయం. అదానీ ఆస్తులు ఏటా 128 శాతం పెరుగుతున్నాయి.

ఎన్వీడియా అధినేత జెన్స‌న్ హ్వాంగ్, మెటా అధినేత మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్, LVMH అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ల ఆస్తులు 2030 నాటికి ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు చేర‌తాయి. భార‌త‌దేశంలో కోటీశ్వ‌రుల ఆస్తుల విలువ ఏటా పెరుగుతూనే ఉంది. ప్ర‌స్తుతం మ‌న భార‌త‌దేశంలోని కోటీశ్వ‌రుల వ‌ద్ద ఉన్న‌ ఆస్తుల విలువ మొత్తం 99.86 ల‌క్ష‌ల కోట్లు. గౌత‌మ్ అదానీ, ముఖేష్ అంబానీల ఆస్తి విలువ 10 ట్రిలియ‌న్లు. ఇక భార‌త్ నుంచి మూడో స్థానంలో ఉన్న‌ది షాపూర్జీ ప‌లోన్జీ. ఈయ‌న ఆస్తి విలువ 3.65 ట్రిలియ‌న్.

2023లో ప్ర‌తి ఐదు రోజుల‌కు భార‌త్ నుంచి ఒక కోటీశ్వ‌రుడు పుట్టుకొస్తున్నాడ‌ట‌. భార‌త్‌లో మొత్తం 1500 మంది కోటీశ్వ‌రులు ఉన్నారు. వీరి ఆస్తుల విలువ రూ.1000 కోట్ల పైనే ఉంటుంది.