Gaza: నింద మాపై వేయాలని చూస్తున్నారా..?
Rocket attack on Gaza Hospital: గాజాలోని (gaza) ఓ హాస్పిటల్‌పై భీకర దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 500 మంది మృత్యువాతపడ్డారు. అయితే ఈ దాడికి పాల్పడింది గాజాకు చెందిన హమాస్ సంస్థే అని ఇజ్రాయెల్ ఆర్మీ (israel army) అంటోంది. కానీ హమాస్ మాత్రం ఇది తామే చేయలేదని అంటోంది. తమకు ఇంటెలిజెన్స్ సంస్థల గురించి అందిన సమాచారం ప్రకారం పాలెస్తీనాకు (palestine) చెందిన ఇస్లామిక్ జిహాద్ అనే సంస్థ ఈ దాడికి పాల్పడినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. నిజానికి వారి టార్గెట్ హాస్పిటల్ కాదని.. వేరే ప్రాంతాన్ని దాడి చేయగా ఆ రాకెట్ ఫెయిల్ అయ్యి హాస్పిటల్ దగ్గర పేలిందని తెలిపారు. (gaza hospital attack)
మరోపక్క ఇస్లామిక్ జిహాద్ సంస్థ ఈ దాడికి పాల్పడింది తాము కాదు అంటోంది. ఇజ్రాయెల్ ఆర్మీ చేసిందంతా చేసి తమపై నింద మోపాలని చూస్తోందని ఆరోపించింది. గాజాపై జరిగిన దాడి కారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden) తన ఇజ్రాయెల్ పర్యటనను విరమించుకున్నారు. మరోపక్క ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఈ దాడికి కారణం ఇజ్రాయెల్, అమెరికానే అని నిందిస్తున్నారు. ఇక ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఆరోపణ మరోలా ఉంది. ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కారణంగానే ఈ దాడి జరిగిందని ఆయన అంటున్నారు. మొత్తానికి ఈ దాడికి పాల్పడింది మేమే అని ఇప్పటివరకు ఏ సంస్థ కూడా నిర్ధారించింది లేదు.