Neville Roy Singham: భార‌త్‌కు డ్రాగ‌న్ రంగు పుల‌మాల‌ని..!

నెవీల్ రాయ్ సింగం.. (neville roy singham) ఇప్పుడు తెగ వైర‌ల్ అవుతున్న పేరు. భార‌త్‌లో న్యూస్ క్లిక్  (news click)అనే మీడియా సంస్థ‌కు చైనా (china) ద్వారా ఫండ్స్ ఇప్పించి ఆ దేశానికి సంబంధించిన ప్ర‌చారం చేయిస్తున్నార‌ని ఎంతో కాలంగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీలోని దాదాపు 30 ప్ర‌దేశాల్లో న్యూస్ క్లిక్ సంస్థ‌లో ప‌నిచేస్తున్న జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల‌ల్లో త‌నిఖీలు చేసారు. వారిని పోలీస్ స్టేష‌న్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

అస‌లు ఎవ‌రీ సింగం?

ఇత‌ను శ్రీలంక‌కు చెందిన పొలిటిక‌ల్ శాస్త్రవేత్త ఆర్కిబాల్డ్ విక్ర‌మ‌రాజ సింగం కుమారుడు. నెవీల్ అమెరికాలో థాట్ వ‌ర్క్స్ అనే ఐటీ సంస్థ‌ను ప్రారంభించాడు. అమెరికా మిలియ‌నేర్ల‌లో ఇత‌ను ఒక‌రు. ఇత‌ను చైనాకు స‌పోర్ట్ చేసేందుకు ఒక గ్లోబ‌ల్ ఫైనాన్షియ‌ల్ నెట్‌వ‌ర్క్‌ను స్థాపించాడు. ఈ సంస్థ ద్వారా భార‌త్‌లో న్యూస్ క్లిక్ ఉన్న‌ట్లే.. వివిధ దేశాల్లో వివిధ మీడియా సంస్థ‌ల‌ను పెట్టించి వారికి చైనా ద్వారా ఫండ్స్ ఇప్పించి ఆ దేశం కోసం ప్ర‌చారం చేయిస్తున్నాడని కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ టైమ్స్ చేప‌ట్టిన ఇన్‌వెస్టిగేష‌న్‌లో తేలింది. అమెరికాలోని ప‌లు చారిటీలు, నాన్ ప్రాఫిట్ సంస్థ‌ల‌తో కూడా నెవిల్ చైనా కోసం ప్ర‌చారం చేయిస్తున్నాడు. (neville roy singham)

ఏం ప్ర‌చారం చేస్తున్నారు?

చైనా దేశంలో ఏమేం జ‌రుగుతున్నాయి? అక్క‌డి రాజ‌కీయ నేత‌లు ఏం మాట్లాడుతున్నారు వంటి విష‌యాల‌న్నీ ఈ న్యూస్ క్లిక్ సంస్థ రాసి పబ్లిష్ చేస్తోంది. అస‌లు దీని వ‌ల్ల వారికేం లాభమో విచార‌ణ‌లో తెలుస్తుంది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ చైనా త‌ర‌ఫు ప్ర‌చార సంస్థ‌లు కేవ‌లం అమెరికా నాన్ ప్రాఫిట్ సంస్థ‌ల నుంచే 275 మిలియ‌న్ డాల‌ర్ల వ‌ర‌కు ఫండ్స్ పొందింది.

ఒక‌ప్పుడు శ‌తృత్వం ఇప్పుడు దోస్తీ

2016లో నెవిల్ యాక్టివిస్ట్ అయిన జోడీ ఇవాన్స్ అనే యువ‌తిని పెళ్లి చేసుకున్నాడు. ఈమె కోడ్ పింక్ అనే సంస్థ‌ను న‌డుపుతోంది. ఈ సంస్థ ఒక‌ప్పుడు చైనా విరోధి. కానీ ఇప్పుడు అతిపెద్ద స‌పోర్ట‌ర్‌గా ఎందుకు మారిందో వారికే తెలియాలి. చైనా క‌మ్యునిస్ట్ పార్టీతో నెవిల్‌కు మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి. చైనాలోని టైమ్స్ స్క్వేర్ బిల్డింగ్‌లో నెవిల్ ఆఫీస్ కూడా ఉంది. (neville roy singham)