LSGకి చుక్కలు చూపించిన ఎవరీ ఆకాష్ మద్వాల్?!
Hyderabad: ఆకాష్ మద్వాల్ (akash madhwal).. నిన్న జరిగిన మ్యాచ్‌లో ఇతని గురించే చర్చ అంతా. బుధవారం జరిగిన LSG వర్సెస్ MI మ్యాచ్‌లో ముంబైను క్వాలిఫైయర్ రౌండ్స్‌ని తీసుకెళ్లింది మద్వాలే. ఇంతకీ ఎవరీ మద్వాల్? యంగ్ ఫాస్ట్ బౌలర్ అయిన మద్వాల్ (madhwal) ముంబై టీంకు కోహీనూర్ వజ్రం లాంటివాడనే చెప్పాలి. 3.3 ఓవర్లలో 5/5 అంటే మాటలా? ఆల్మోస్ట్ అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రాల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే మద్వాల్ గురించి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. నాలుగేళ్ల క్రితం వరకు అతను టెన్నిస్ ఆడుతుండేవాడు. ఇంజినీరింగ్ పూర్తిచేసిన మద్వాల్.. ఉత్తరాఖండ్‌లో పుట్టాడు. ఆ రాష్ట్రం నుంచి టీమిండియాకు ఎంపికైన మొదటి క్రికెటర్ మద్వాలే. ముంబై ఇండియన్స్ టీం సూర్యకుమార్ యాదవ్‌కు రీప్లేస్మెంట్‌గా మద్వాల్‌ను (akash madhwal) కొనుగోలు చేసింది.
2019లో ఉత్తరాఖండ్‌లో (uttarakhand) క్రికెట్ కోచ్‌గా పనిచేస్తున్న వాసిమ్ జాఫర్‌కి, ఇప్పటి కోచ్ మనీష్ ఝాకి మద్వాల్‌లోని టాలెంట్ అర్థమైంది. వారి కోచింగ్ పుణ్యమా అని ఫాస్ట్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసాడు. ఇక ఆ తర్వాత 2023లో ముంబై ఇండియన్స్ టీం కన్ను మద్వాల్‌పై పడటం.. అతన్ని టీంలోకి తీసుకోవడం జరిగింది. ఉత్తరాఖండ్ ఇతన్ని వైట్-బాల్ స్కిప్పర్‌గా పిలుస్తుంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ కూడా ఉత్తరాఖండ్‌కు చెందినవాడే. పంత్ దిల్లీ క్యాపిటల్స్‌లోకి రాకముందు అవతార్ సింగ్ అనే కోచ్ పంత్‌కు ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పుడు మద్వాల్‌ను ఐపీఎల్ కోసం తీర్చిదిద్దింది కూడా అవతార్ సింగే. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ (rohit sharma) కూడా మద్వాల్ (akash madhwal) టాలెంట్‌కి ఫిదా అయిపోయాడు.