Anant Radhika Wedding: అత్యంత ఖరీదైన కానుక ఎవరిచ్చారో తెలుసా?
Anant Radhika Wedding: రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక ఇటీవల గుజరాత్‌లోని జామ్ నగర్లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. హస్తాక్షర్తో ఈ వేడుకని ముగించారు. అయితే ఇది అసలైన పెళ్లి కాదు. కేవలం ప్రీ వెడ్డింగ్ వేడుక మాత్రమే. అసలైన పెళ్లి జూన్ లేదా జులైలో ఉంటుందని టాక్.
మొన్న జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ నుంచి ఎందరో సెలబ్రిటీలు వచ్చి హంగామా చేసారు. అంతర్జాతీయ గాయకులు రిహాన్నా, ఏకాన్ వచ్చి తమ కచేరీ కార్యక్రమాలతో అలరించారు. అయితే.. వేడుకకి వచ్చిన సెలబ్రిటీలు కాబోయే దంపతులు అనంత్, రాధికలకు ఖరీదైన కానుకలు ఇచ్చారట. ఇంతకీ ఎవరెవరు ఏ కానుకలు ఇచ్చారంటే..
రణ్‌బీర్ కపూర్ – ఆలియా భట్ : గుచ్చీ బ్రాండ్‌కి చెందిన డైమండ్ పర్స్, ఎయిర్ జోర్డాన్ షూస్
సల్మాన్ ఖాన్ : ఖరీదైన కస్టమైజ్డ్ వాచీ, డైమండ్ కమ్మలు
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ : బంగారం, వజ్రంతో తయారుచేసిన వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాలు (కియారా అడ్వాణీకి చిన్నప్పటి నుంచి అంబానీ కుటుంబంతో మంచి రిలేషన్ ఉంది. ఇషా అంబానీ, కియారా అడ్వాణీలు స్కూల్ ఫ్రెండ్స్)
విక్కీ కౌశల్ – కత్రినా కైఫ్: వజ్రాల బ్రేస్లెట్, నెక్లెస్
దీపిక పదుకొణె – రణ్వీర్ సింగ్ : కోటి రూపాయలు విలువ చేసే రోలెక్స్ వాచీలు
మరి ఇంతమంది అతిథుల్లో కాబోయే వధూవరులకు అత్యంత ఖరీదైన కానుక ఎవరు ఇచ్చారో తెలుసా? బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్. రూ.5 కోట్లు విలువ చేసే మెర్సిడెజ్ బెంజ్ 300 SLR కానుకగా ఇచ్చారు. అతిథుల నుంచి వచ్చిన కానుకల్లో అత్యంత విలువైన కానుక ఇదేనని తెలుస్తోంది.