Lesbian Wedding: ప్రేమించుకుని పెళ్లికి ముందే బ్రేకప్.. ఏంటి వీళ్ల కథ?
Lesbian Wedding: పై ఫోటోలో ఉన్న అమ్మాయిలను చూసారా? వీరిద్దరూ లెస్బియన్స్. అంటే అమ్మాయికి అమ్మాయిపైన ప్రేమ పుట్టడం. వీరిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంకో వారంలో పెళ్లి అనగా బ్రేకప్ అయ్యింది. పైగా వీరిద్దరూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కావడంతో వీరి కథ వైరల్ అవుతోంది.
వీరి పేర్లు సూఫీ మాలిక్, అంజలి చక్రా. ఒకరిది పాకిస్థాన్, మరొకరిది ఇండియా. సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడటంతో ప్రేమించుకున్నారు. 2019లో వర్షంలో జంటగా డ్యాన్స్ చేస్తూ ఫాలోవర్లను సంపాదించుకుని ఫేమస్ అయిపోయారు. అప్పటి నుంచి డేటింగ్లో ఉన్నారు. ఈ ఏడాదిలో వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇందుకు కారణం పాకిస్థానీ యువతి అయిన మాలిక్ సూఫీ మరో అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుని అంజలిని మోసం చేసిందట.
ఈ విషయం తెలీడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అసలు ఇలాంటి ప్రేమ కథలు వినడానికే దరిద్రంగా ఉంటాయంటే దానికి తోడు ఏదో సెలబ్రిటీల లాగా విడిపోతున్నట్లు ఇన్స్టాగ్రామ్లో అధికారికంగా ప్రకటించడం మరో ఎత్తు. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. అంజలిని మోసం చేసినట్లు సూఫీ మాలిక్ ధైర్యంగా సోషల్ మీడియాలో ప్రకటించడం. ఇందుకు అంజలికి క్షమాపణలు చెప్తున్నట్లు పోస్ట్ పెట్టడం. అసలు ఈ ఇన్ఫ్లుయెర్సర్ల గొడవేంటో.. ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏంటో సమాజం ఎటు పోతోందో ఏంటో..!