Shahrukh Khan: నా బిడ్డను… కంటతడి పెట్టించేలా మెసేజ్‌లు
Mumbai: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్(shahrukh khan), మాజీ యాంటీ డ్రగ్స్ ఆఫీసర్ సమీర్ వాంఖడే(sameer wankhede) మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ బయటికి రావడం చర్చనీయాంశంగా మారింది. రెండేళ్ల క్రితం షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఓ క్రూజ్‌లో పార్టీ చేసుకుంటుండగా సమీర్, అతని టీం రైడ్లు చేసారు. అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారన్న అనుమానంతో ఆర్యన్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సమీర్ డబ్బుకోసం కావాలనే ఆర్యన్‌ను అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్యన్‌ను విడిపించేందుకు రూ.25 కోట్లు అడిగినట్లు తెలుస్తోంది. దాదాపు నెల రోజుల తర్వాత ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఎక్కడా ఎవిడెన్స్ లేకపోవడంతో అతన్ని వదిలేసారు.
ఈ నేపథ్యంలో ఇటీవల సమీర్(sameer) షారుక్(shahrukh) నుంచి రూ.25 కోట్లు రాబట్టాలని చూసినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై సీబీఐ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో భాగంగా సమీర్.. తనకు షారుక్‌కు మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ కోర్టులో సబ్మిట్ చేసారు. ఆ చాట్స్‌లో “సమీర్.. ఆర్యన్ అలాంటివాడు కాదని నీకూ తెలుసు. తెలిసీ తెలీక పార్టీకి వెళ్లాడు. వాడు చేసింది తప్పే. కానీ మరీ జైల్లో ఉంచేంత పెద్ద క్రిమినల్ కాదు. అలా చేస్తే వాడి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాస్త పెద్ద మనసు చేసుకుని వాడితో సున్నితంగా ప్రవర్తించు. నీకు దండంపెడతాను.. మా అబ్బాయిని వదిలెయ్. వాడు నువ్వు నేను గర్వించేంత గొప్ప మనిషిగా మారుస్తాను. ప్లీజ్ సమీర్” అంటూ షారుక్ వేడుకున్నారు.
ఇందుకు సమీర్ .. “నువ్వు మంచివాడివే షారుక్. చూద్దాం ఏం జరుగుతుందో” అని రిప్లై ఇచ్చాడు. అయితే తను షారుక్‌ని డబ్బు ఇవ్వమని అడగలేదని, తనపై సీబీఐ తప్పుడు ఆరోపణలు చేస్తోందని సమీర్ ఆరోపిస్తున్నారు. ఈ కేసు కొట్టివేయాలని కోర్టులో అప్పీల్ దాఖలు చేసారు.