Parliament: మార్చేసారు.. ఇప్పుడు కూల్చేస్తారా?
96 ఏళ్లు చరిత్ర గల పార్లమెంట్ (parliament) భవనాన్ని విడిచి ఇప్పుడు కొత్తగా నిర్మించిన భవనంలోకి మారిపోయారు పార్లమెంట్ సభ్యులు. ఈరోజు నుంచి కొత్త పార్లమెంట్‌లోనే అన్ని సమావేశాలు జరుగుతాయి. మరి ఎన్నో చారిత్రక ఘట్టాలకు నిర్ణయాలకు సాక్షిగా నిలిచిన పాత పార్లమెంట్ భవనాన్ని ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. ఈ పార్లమెంట్‌ను 1926లో నిర్మించారు. దీని వయసు 96 ఏళ్లు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పార్లమెంట్లో జాగా సరిపోవడంలేదట. అందుకే కొత్త పార్లమెంట్‌కు షిఫ్ట్ అవుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) తెలిపారు.
పాత భవనాన్ని కూల్చేస్తారా?
అస్సలు కాదు. పాత భవనాన్ని (parliament) చారిత్రాత్మక కట్టడంగా భావించి దీనిని ఓ మ్యూజియంగా మార్చే యోచనలో కేంద్రం ఉంది. బ్రిటిష్ ఆర్కిటెక్ట్‌లు అయిన ఎడ్విన్ లుట్యెన్స్, హెర్బెర్ట్ బేకర్ ఈ బిల్డింగ్‌ను డిజైన్ చేసి దగ్గరుండి నిర్మించారు. బ్రిటిషర్ల నుంచి విముక్తి పొందడానికి దేశం పడిన స్వాతంత్ర్య పోరాటాన్ని కూడా ఈ పార్లమెంట్ భవనం వీక్షించింది. అంతేకాదు.. స్వాతంత్ర్యం వచ్చాక దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో కూడా కళ్లారా చూసింది. ఈ భవనంలో కావాల్సిన రిపేర్లు, మార్పులు చేసి ఇతర కార్యక్రమాల కోసం వాడుకుంటామని 2021లోనే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఈ భవనంలో పెట్టిన జాతీయ ఆర్కైవ్స్‌ని కొత్త పార్లమెంట్ భవనంలోకి బదిలీ చేయనున్నారు. దీని వల్ల పాత బిల్డింగ్‌లో మరింత స్పేస్ ఉంటుందని అన్నారు. పార్లమెంట్ భవనాన్ని మొత్తం కాకుండా.. కొంత భాగాన్ని మాత్రమే మ్యూజియంగా మారుస్తారని అంటున్నారు.
ఆసక్తికర అంశాలు
*పాత పార్లమెంట్ భవనాన్ని 164 స్తంభాలతో నిర్మించారు. పైన కనిపిస్తున్న ఫోటో మధ్యప్రదేశ్‌లోని చౌతస్ యోగిని ఆలయానిది. ఆ ఆలయంలో 64 ఛాంబర్లను 64 యోగినిలకు నివాళిగా కట్టారు. ఈ ఆకారంలోనే మన పాత పార్లమెంట్‌ను కూడా నిర్మించారు.
*భారత్‌కు స్వాతంత్రం రాకముందు వరకు ఈ పార్లమెంట్ భవనాన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌గా పిలిచేవారు. ఎప్పుడైతే భారత్‌కు బ్రిటిష్ నుంచి విముక్తి కలిగిందో అప్పటి నుంచి పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా సంబోధించారు. (parliament)
*న్యూ ఢిల్లీని ప్లాన్ చేస్తున్న సమయంలోనే అప్పటి వైస్రాయ్ లార్డ్ హార్డింగే.. పార్లమెంట్‌లోని ప్రతి కట్టడాన్ని భారతీయ సంప్రదాయానికి నిదర్శనగా ఉండాలే కానీ విదేశీ అంశాలు కనిపించకూడదని అన్నారట.
*ఈ పార్లమెంట్ భవనం రౌండ్‌గా ఉంటుంది కాబట్టి… సర్క్యులర్ హౌజ్ అని కూడా పిలిచేవారు.
*అప్పట్లో ఈ బిల్డింగ్‌ను కట్టడానికి అయిన ఖర్చు రూ.83 లక్షలు. (parliament)
*దేశంలోనే అతిపెద్ద లైబ్రరీ కలకత్తాలో ఉంది. ఆ తర్వాత రెండో అతిపెద్ద లైబ్రరీ పార్లమెంట్ భవనంలోనే ఉంది.
*ఈ పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌నే కొన్నాళ్ల పాటు సుప్రీంకోర్టుగా చేసారు. ఆ తర్వాత సుప్రీంకోర్టుకు సపరేట్ బిల్డింగ్ రావడంతో అక్కడికి మార్చేసారు.
*ఈ భవనంలోని లోక్ సభ, రాజ్య సభలు గుర్రం ఆకారంలో నిర్మించారు.
*పార్లమెంట్‌లోని 13వ గదిని రాష్ట్రపతికి కేటాయిస్తారు.