Chandrayaan 3: విక్రమ్, ప్రజ్ఞాన్ లేవకపోతే ఏంటి పరిస్థితి?
ఈరోజు ఇస్రో (isro) చంద్రయాన్ 3 (chandrayaan 3) మిషన్‌లో భాగంగా జాబిల్లికి దక్షిణ ధృవం వైపు స్లీప్ మోడ్‌లో ఉన్న విక్రమ్ ల్యాండర్ (vikram lander), ప్రజ్ఞాన్ రోవర్‌లను (pragyan rover) నిద్రలేపాల్సి ఉంది. ఇస్రో ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ విక్రమ్, ప్రజ్ఞాన్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేకపోవడం ఆందోళనకు దారితీస్తోంది. చంద్రయాన్ 3 సక్సెస్ ఒక విజయం అయితే.. ఇప్పుడు విక్రమ్, ప్రజ్ఞాన్ రెండూ నిద్రలో నుంచి లేవడం రెండో విజయం అవుతుంది. ఎప్పుడు సిగ్నల్ వస్తుందా అని ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు ఇండియా కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.
నిద్రలేవకపోతే ఏంటి పరిస్థితి?
ఒకవేళ విక్రమ్, ప్రజ్ఞాన్‌లు నిద్రలో నుంచి లేవకపోతే జాబిల్లిపై భారత్ తరఫు అంబాసిడర్లుగా అక్కడే మిగిలిపోతారని ఇస్రో వెల్లడించింది. దాదాపు 15 రోజుల క్రితం ఈ రెండూ స్లీప్‌మోడ్‌లోకి వెళ్లాయి. ఎందుకంటే.. ఈ పదిహేను రోజుల పాటు జాబిల్లి దక్షిణ ధృవంపై సూర్య కిరణాలు పడవు. దాంతో అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 240 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతుంది. అంత చల్లటి ప్రదేశంలో బ్యాటరీలు పనిచేస్తాయో లేదో అని ఇస్రో ముందు నుంచి సందేహపడుతూనే ఉంది. ఈరోజు ఉదయం నుంచి ఇస్రో వాటిని నిద్ర నుంచి లేపేందుకు యత్నిస్తోంది కానీ సిగ్నల్ మాత్రం అందడంలేదట. అవి నిద్రలేస్తే ఇస్రో ఘనతనల్లో మరొకటి వచ్చి చేరుతుంది. (chandrayaan 3)