G20 Food Specials: G20 భోజనంబు వెరైటీ వంటకంబు
జీ20 సమ్మిట్‌లో (g20 summit) భాగంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దేశాధినేతల కోసం తయారుచేయించిన రకరకాల విందు (g20 food specials). దేశంలోనే టాప్ చెఫ్స్ అయిన కునాల్ కపూర్, అనాహిత దోండీ, అజయ్ చోప్రాలతో పాటు మరెందరో చెఫ్స్ ఎన్నో వెరైటీ వంటకాలను వండిపెడ్డారు. అయితే కునాల్ కపూర్ (kunal kapur) మాత్రం బ్రిటన్, జపాన్, టర్కీ ప్రథమ మహిళలకు సర్వ్ చేసారు. వారికి రకరకాల రెసిపీలను రుచి చూపించి తన రెసిపీ బుక్‌ని కూడా వారికి షేర్ చేసారు.
ఇది తనకు జీవితంలో ఒకసారి లభించే అవకాశమని దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ప్రథమ మహిళలకు ఎక్స్‌క్లూజివ్‌గా కుకింగ్ క్లాస్‌ని కూడా ఎరేంజ్ చేసారు. ఇన్నాళ్లూ ఎంతో కష్టపడి ఎన్నో రకాల వంటకాలను రుచిగా వండటం నేర్చుకున్నాక మొత్తానికి దేశాధినేతలకు తన వంటల రుచి చూపించే అవకాశం దక్కిందని తెలిపారు. “” జీ20కి వచ్చే అన్ని దేశాల ప్రథమ మహిళలకు వండి పెట్టే అవకాశం నాకు దక్కింది. అంతేకాదు.. వారికి స్పెషల్‌గా కుకింగ్ క్లాసెస్ కూడా ఎరేంజ్ చేస్తాను. భారతీయ రుచులు, భారతీయ వంటతీరును వారికి పరిచయం చేస్తాను. ఎక్కువగా మన భారతీయ తృణధాన్యాలకు సంబంధించిన వంటకాలను వారికి పరిచయం చేయబోతున్నాను. ఇది ఎంతో ముఖ్యమైన అంశం “” అని కునాల్ తెలిపారు. (g20 food specials)
వంటకు కావాల్సిన సమాన్లన్నీ ఢిల్లీ నుంచే తెప్పించానని అన్నారు. భారతీయ వంటకాలు కారంగా అనారోగ్యకరంగా ఉంటాయని చాలా మంది అనుకుంటారని అది కరెక్ట్ కాదు అని నిరూపిస్తానని తెలిపారు. ఇండియా – ఆఫ్రికా సమ్మిట్ సమయంలో కూడా వివిధ దేశాలకు చెందిన ప్రథమ మహిళల కోసం వంటకాలను తయారుచేసే అవకాశం తనకే దక్కిందని కునాల్ వెల్లడించారు. ఓసారి ఢిల్లీలో జరిగిన ఇండియా – ఆఫ్రికా సమ్మిట్‌కి మొత్తం 42 ఆఫ్రికన్ దేశాలకు చెందిన ప్రథమ మహిళలు వచ్చారని వారికి కూడా భారతీయ వంటకాలను పరిచయం చేసానని అన్నారు. భారతీయ వంటకాలను ఇతర దేశాలకు పరిచయం చేయడం ఎంతో అద్భుతమైన విషయం అని అన్నారు.