Anant Radhika Wedding: చిన్న కోడ‌లికి నీతా ఇచ్చిన కానుక ఇదే

what radhika merchant got from mother in law nita ambani

Anant Radhika Wedding: అంబానీ దంప‌తుల చిన్న కొడుకు అనంత్ అంబానీ వివాహ వేడుక ఇట‌లీలో గ్రాండ్‌గా మొద‌లైపోయింది. ఇట‌లీలోని ఓ క్రూజ్ షిప్‌లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. అయితే.. నీతా అంబానీ త‌న చిన్న కోడ‌లు అయిన రాధికా మ‌ర్చెంట్‌కు ఏం కానుక‌గా ఇచ్చారు అనే దానిపై ఇప్పుడు చ‌ర్చ మొద‌లైంది. పెద్ద కోడ‌లు శ్లోకా మెహ‌తాకి 450 కోట్ల ఖ‌రీదైన బంగ్లాతో పాటు 200 కోట్ల ఖ‌రీదైన నెక్లెస్ ఇచ్చారు. ఇప్పుడు చిన్న కోడ‌లు రాధికా మ‌ర్చెంట్‌కి దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుక‌గా ఇచ్చార‌ట‌.

దుబాయ్‌లోని ఫేమ‌స్ పామ్ జుమైరాలో ఈ విల్లా ఉంద‌ట‌. దుబాయ్‌లో అత్యంత ఖ‌రీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్‌రూంలు, 70 మీట‌ర్ల ప్రైవేట్ బీచ్‌ను ఏర్పాటుచేసారు. దాదాపు మూడు రోజుల పాటు ఇట‌లీలో అనంత్ రాధిక‌ల వివాహం జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే బాలీవుడ్ సెలబ్రిటీలు ఇట‌లీ చేరుకున్నారు.