Miss Universe: మలాలా పేరు చెప్పినందుకే ఆమె ఓడిపోయిందా?
Miss Universe: ఈసారి 2023 మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నికరాగ్వాకు (nicaragua) చెందిన మోడల్ షెన్నిస్ పలాషియోస్ (Sheynnis Palacios) కిరీటం దక్కించుకుంది. మొత్తం ముగ్గురు ఫైనలిస్ట్‌లలో షెన్నిస్‌తో పాటు థాయ్‌లాండ్‌కు చెందిన ఆంటోనియా పోర్సిల్డ్, ఆస్ట్రేలియాకు చెందిన మొరాయా విల్సన్ ఉన్నారు. ఈ ముగ్గురిలో షెన్నిస్ విజేతగా నిలిచారు.
ఈ ముగ్గురికీ చివరి రౌండ్‌లో అడిగిన ప్రశ్న ఏంటంటే.. ఒకరోజు పాటు మరో మహిళ స్థానంలో మీరు ఉండే అవకాశం వస్తే మీరు ఎవరిని ఎంచుకుంటారు? ఎందుకు? అని అడిగారు. దీనికి థాయ్‌లాండ్ ఫైనలిస్ట్ చెప్పిన సమాధానం ఏంటంటే..“” నేను మలాలా యూసఫ్‌జాయ్‌ని ఎంచుకుంటాను. ఎందుకంటే ఆమె ఈరోజు అనుభవిస్తున్న జీవితం కోసం ఎంతో పోరాడింది. తను ఎంత కష్టపడిందో నాకు తెలుసు “” అన్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫైనలిస్ట్ సమాధానంగా.. “” నేను మా అమ్మను ఎంచుకుంటాను. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకే ఆమె త్యాగాలే కారణం “” అని చెప్పారు. (miss universe)
ఇక విజేతగా నిలిచిన షెన్నిస్ సమాధానం ఇస్తూ.. “” నేను మేరీ వోల్‌స్టోన్ క్రాఫ్ట్‌ను ఎంచుకుంటాను. ఎందుకంటే మహిళలకు దక్కాల్సిన హక్కులు దక్కడంలేదని ముందు చర్చకు తెరలేపింది ఆమే “” అని చెప్పారు. ఈ మూడు సమాధానాల్లో జడ్జెస్‌కు షెన్నిస్ చెప్పిన సమాధానానికే ఓటు వేసారు. ఆస్ట్రేలియా ఫైనలిస్ట్ చెప్పిన సమాధానం మరీ రొటీన్‌గా ఉండటంతో వారికి నిజాయతీగా అనిపించలేదట. ఇక థాయ్‌లాండ్ ఫైనలిస్ట్ చెప్పిన సమాధానం వారికి అంతగా నచ్చలేదని సమాచారం. (miss universe)