Aadhaar Card లో ఏ వివరాలు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు?
Aadhaar Card: దాదాపు అన్ని ముఖ్యమైన పనులకు ఆధార్ కార్డు ఎంతో కీలకం. అయితే చాలా మంది ఆధార్ కార్డులో ఎలాంటి వివరాలు మార్చుకోవచ్చు అనే అంశంపై క్లారిటీ ఉండదు. ఆధార్ కార్డు అప్డేట్ చేసి ఉంటే కొన్ని సాంకేతిక సమస్యలు మన దరిచేరవు. ఇంతకీ ఆధార్ కార్డులో ఎలాంటి వివరాలు అప్డేట్ చేసుకోవాలో ఏవి అప్‌డేట్ చేసుకోలేమో తెలుసుకుందాం.
ఆధార్‌లో ఏ సమాచారం అప్డేట్ చేసుకోవచ్చు?
*మీరు పేరును ఆధార్ కార్డులో మార్పించుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ కేవలం రెండు సార్లు మాత్రమే వర్తిస్తుంది.
*మీ జెండర్‌ను కూడా ఆధార్ కార్డులో మార్పించుకోవచ్చు. కొందరి ఆధార్ కార్డులలో మగవారికి ఫీమేల్ అని ఆడవారికి మేల్ అని ప్రింట్ అయ్యి ఉంటుంది. అలాంటివారు మార్పించుకోవచ్చు. అయితే జెండర్ చేంజ్ ఆప్షన్ అనేది ఒకసారి మాత్రమే వర్తిస్తుంది.
*పుట్టిన తేదీని మార్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు బర్త్ సర్టిఫికేట్లను పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒకవేళ మార్పించుకోవాలనుకుంటే సరైన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది.
*మీరు ఒకవేళ వేరే ప్రాంతానికి బదిలీ అవ్వాల్సి వస్తే ముందుగా చేయాల్సిన పని ఆధార్ కార్డులో అడ్రెస్ మార్పించుకోవడం. ఇలా ఎన్నిసార్లు బదిలీ అయితే అన్నిసార్లు మీ ఇంటి చిరునామాను మార్పించుకునే అవకాశం ఉంటుంది.