Ratan Tata: రతన్ టాటా ఎలా చనిపోయారు? ఏం జరిగింది?
Ratan Tata: భారత్ మెచ్చిన పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణం జీర్ణించుకోలేనిది. అనారోగ్యంతో ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేర్పించగా.. తన ఆరోగ్యం బాగానే ఉందని.. కేవలం రెగ్యులర్ వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మాత్రమే హాస్పిటల్‌కు వచ్చానని టాటా ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ చేసిన మరుసటి రోజు రాత్రే కన్నుమూసారు. అయితే.. రతన్ టాటా చనిపోయారు అని రాసారే కానీ ఆయన ఆరోగ్యం విషయంలో ఏం జరిగింది అనేది మాత్రం బయటికి రాలేదు.
రతన్ టాటా బీపీ పడిపోతుండడంతో ఆయన్ను హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌కు తరలించిన తర్వాత కూడా బీపీ డౌన్ అయిపోతుండడంతో ఆయన్ను వెంటిలేటర్‌పై ఉంచారు. అప్పటికే పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. బీపీ డౌన్ అవ్వడాన్ని హైపో టెన్షన్ అంటారు. ఈ హైపో టెన్షన్ సైలెంట్ కిల్లర్. ముఖ్యంగా వయసు పై బడిన వారికి ఈ హైపో టెన్షన్ మరీ ప్రమాదకరం. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రతన్ టాటా హైపో టెన్షన్‌తోనే తమ వద్దకు వచ్చారని.. అన్ని వైద్య పరీక్షలు చేస్తున్నంత వరకు బాగానే ఉన్న ఆయనకు ఉన్నట్టుండి పల్స్ మరీ పడిపోతుండడంతో చనిపోయారని వెల్లడించారు.