Bengaluru Murder: రిజైన్ చేసి.. కంపెనీ పెట్టి.. బాస్‌ని చంపేసారు!
Bengaluru: చక్కగా ఓ కంపెనీలో పనిచేసుకుంటూ జీవించారు. ఆ తర్వాత ఈ ఉద్యోగాలు మనవల్ల కాదనుకుని అలాంటిదే మరో కంపెనీ పెట్టారు. పైగా పాత కంపెనీలోని ఉద్యోగుల్ని ఎక్కువ జీతాలు ఇస్తాం అని చెప్పి తమ కంపెనీలోకి లాక్కున్నారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో.. పాత కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌ని, సీఈఓని దారుణంగా నరికి చంపేసారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో (bengaluru murder) నిన్న చోటుచేసుకున్న డబుల్ మర్డర్ల కథ ఇది.
పై ఫొటోలో కనిపిస్తున్నవారి పేర్లు శబరీష్, వినయ్ రెడ్డి, సంతోష్. వీరు ముగ్గురూ అమృతహళ్లిలోని పంపా ఎక్స్‌టెన్షన్‌లోని ఏరోనిక్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేసేవారు. అయితే ఆ ఉద్యోగం చేయడం కంటే అలాంటిదే ఇంకో కంపెనీ పెడితే బాగుంటుంది అని శబరీష్, వినయ్ రెడ్డిలు ప్లాన్ వేసారు. అలాంటి కంపెనీ కూడా పెట్టారు. పైగా ఏరోనిక్స్ సంస్థలో పనిచేస్తున్నవారిని తమ కంపెనీలోకి లాక్కోవాలని చూసారు. ఈ విషయం ఏరోనిక్స్ కంపెనీ ఎండీ, సీఈఓలు విను కుమార్, ఫణీంద్ర సుబ్రహ్మణ్యలకు తెలిసింది. ఇంకోసారి తమ కంపెనీ ఉద్యోగులతో మాట్లాడినట్లు తెలిస్తే బాగోందని హెచ్చరించారు. (bengaluru murder)
దాంతో శబరీష్, వినయ్‌లు కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా వారి అంతు చూడాలని ఫిక్స్ అయ్యారు. రాత్రి సమయంలో వారిని చంపేయాలని ప్లాన్ వేసారు. అలా నిన్న సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వినయ్, శబరీష్, సంతోష్‌లు కలిసి కత్తులతో కంపెనీలోకి చొరబడ్డారు. ఫణీంద్ర, వినులపై దాడి చేసారు. అడ్డు వచ్చినందుకు పది మంది ఉద్యోగులపై కూడా దాడి చేసారు. ఈ ఘటనలో ఫణీంద్ర, వినులు అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. (bengaluru murder)