Horror Story: భారత్లో ఉన్న ఈ వంతెన ప్రాణాలను బలిగొంటుందా?
Horror Story: ఆ ఇంట్లోకి వెళ్లకండి అక్కడ దెయ్యం ఉంది.. ఈ రోడ్డు మీద నుంచి వెళ్లకండి మంచిది కాదు.. ఇలాంటివన్నీ మనం సినిమాల్లోనే వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం. కానీ నిజంగానే ఓ వంతెన మీద నుంచి అది ప్రాణాలను బలిగొంటుందట. ఇది ఏ విదేశాల్లోనో లేదు. మన భారతదేశంలోనే ఉంది. ఇంతకీ ఈ వంతెన కథేంటో తెలుసుకుందాం.
మధ్యప్రదేశ్లోని ఖార్గావ్లో ఉన్న ఓ వంతెన గురించి ఎన్నో హార్రర్ కథలు ఉన్నాయి. ఈ వంతెనను నర్మదా నది మీదుగా కట్టారు. దాదాపు వందేళ్లలో ఈ వంతెన 26 మంది ప్రాణాలను బలిగొందట. ఉదయం పూట ఈ వంతెన చూడటానికి మామూలుగానే ఉంటుంది. అంతా వాహనాల మీద వెళ్తుంటారు కూడా. కానీ చీకటి పడే సమయానికి ఈ వంతెన మీద నుంచి ఎవ్వరూ వెళ్లేందుకు సాహసించరు. అలా వెళ్లిన చాలా మంది చెప్పిన విషయాలు ఏంటంటే.. ఒక్కసారిగా దట్టంగా గాలి వీస్తుంటుంది.. ఊపిరి ఆడదని చెప్పారు. రాత్రి వేళల్లో ఈ వంతెనపై కాసేపు నిలబడినా కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి వంతెన పై నుంచి దూకి ఆత్మహత్యలు చేసుకుంటుంటారని అంటున్నారు. అలా వందేళ్లలో 26 మంది ప్రాణాలు కోల్పోయారట.
ALSO READ: అంబానీ దంపతులు ఆ అంతస్తులోనే ఎందుకుంటారు?
అలా చనిపోయిన వారి ఆత్మలు అదే వంతెన చుట్టూ తిరుగుతున్నాయట. రాత్రి వేళల్లో ఈ వంతెన మీదుగా ఎవరైనా వెళ్లినా కూడా ఎవరో వెనక నుంచి లాగుతున్నట్లు అనిపిస్తుంటుందట. అయితే చనిపోయిన ఆ 26 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోలేదు. వారిలో కొందరు మాత్రమే దూకి చనిపోగా.. మిగతా వారు సెల్ఫీలు తీసుకుంటున్నప్పుడు లేదా ఏదన్నా పూజకు సంబంధించిన వస్తువులను నదిలో వదులుతున్నప్పుడో ప్రాణాలు కోల్పోయారట. (Horror Story)