Vivek Bindra: చెప్పేవి నీతులు..చేసేవి గ‌బ్బు ప‌నులు అంటే ఇదేనేమో

Vivek Bindra: పై ఫోటోలో కనిపిస్తున్న వ్య‌క్తి పేరు వివేక్ బింద్రా. ఇత‌ను పాపుల‌ర్ యూట్యూబ‌ర్, మోటివేష‌న‌ల్ స్పీక‌ర్. మైక్ ప‌ట్టుకుని అంద‌రికీ నీతులు చెప్పే ఇత‌ను ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇందుకు కార‌ణం ఇత‌ను భార్య‌ను ఇష్ట‌మొచ్చిన‌ట్లు కొడుతుంటాడు. 40 ఏళ్ల వ‌య‌సులో పెళ్లి చేసుకుని వివాహ‌మైన ఎనిమిది రోజులకే ఇత‌ని భార్య‌కు టార్చ‌ర్ మొద‌లైంది.

చెంప‌పై కొట్ట‌డంతో ఆమె వినికిడి శ‌క్తి కోల్పోయింది. దాంతో ఇత‌ని బాగోతం బ‌య‌ట‌ప‌డింది. డిసెంబ‌ర్ 6న వివేక్ బింద్రా య‌నికా అనే మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. వివాహం జ‌రిగిన కొద్ది గంటల్లోనే య‌నిక‌ను గ‌దిలోకి తీసుకెళ్లి దారుణంగా బూతులు తిట్టి చేయిచేసుకున్నాడు. డిసెంబ‌ర్ 6 నుంచి య‌నికకు చెవులు ప‌నిచేయడంలేదు. దాంతో య‌నిక సోద‌రుడు విష‌యం తెలుసుకుని వివేక్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసాడు.