Dhokra Art: G20 సమ్మిట్‌లో మన “కళ”కళలు
రెండు రోజుల పాటు దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్‌లో (g20 summit) ప్రధాన ఆకర్షణగా నిలిచిన భారతీయ సంప్రదాయ కళల్లో ఢోక్రా ఆర్ట్ (dhokra art) ఒకటి. ఛత్తీస్‌గడ్‌కి చెందిన ఈ ఢోక్రా కళను బస్తర్ జిల్లాకు చెందిన గిరిజన వాసులు తయారుచేసారు. దీనిని జీ20 సమ్మిట్ (g20 summit) జరుగుతున్న భారత మండపంలో ప్రతిష్ఠించారు. ఈ ఢోక్రా ఆర్ట్‌ను మెటల్ ఆర్ట్ అని కూడా అంటారు. కొడంగావ్ జిల్లాకు చెందిన జయదేవ్ భగేల్‌ను ఢోక్రా ఆర్ట్ రూపకర్త అని అంటుంటారు. ఈ కళను రూపొందించినందుకు ఎంతో అంతర్జాతీయ వేదికల నుంచి ప్రశంసలు, జాతీయ అవార్డులు అందుకున్నారు. (dhokra art)
ఈ బొమ్మలతో పాటు ఢోక్రాకు సంబంధించిన ఆభరణాలను కూడా ప్రదర్శనకు ఉంచారు. ఈ ఆభరణాలను ఛత్తీస్‌గఢ్‌కి చెందినవారే కాకుండా మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన కళాకారులు తయారుచేసారు.
గోండ్ పెయింటింగ్
భారత మండపంలో ప్రదర్శనకు ఉంచినవాటిలో గోండ్ పెయింటింగ్ ఒకటి. ఇది మధ్యప్రదేశ్‌కు చెందిన కళాకారులు రూపొందించారు. దీంతో పాటు ఒడిశా నుంచి సౌరా పెయింటింగ్స్ కూడా ప్రదర్శనకు ఉంచారు. మధ్యప్రదేశ్‌లో ఎంతో ఫేమస్ అయిన మహేశ్వరం సిల్క్‌తో నేసిన చీరను కూడా భారత మండపంలోని ఆర్ట్ గ్యాలరీలో పెట్టారు. ఈ చీరను అస్సాంకు చెందిన కళాకారులు నేసారు.
శాలువాలు
లేహ్, లఢక్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఎంతో ఫేమస్ అయిన అంగోరా, పష్మినా శాలువాలను కూడా ప్రదర్శనలో ఉంచారు. వీటిని బోధ్, భుటియా గిరిజనులు నేసారు. ఇక నాగాల్యాండ్ నుంచి కోన్యాక్ గిరిజనులు రూపొందించిన అందమైన ఆభరణాలు కూడా ఉన్నాయి.
అంబాబరీ కళలు
రాజస్థాన్‌కు చెందిన అంబాబరీ మెటల్‌తో మీనా గిరిజిన కళాకారులు రూపొందించిన కళాఖండాన్ని కూడా ప్రదర్శనలో ఉంచారు. అంతేకాదు.. మన తెలుగు ప్రదేశం అయిన అరకు నుంచి కాఫీ, తేనె, జీడిపప్పు, బియ్యం, మసాలాలను ప్రమోట్ చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వం అన్న మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, కళలను కళ్లకు కట్టినట్లుగా ఒకే దగ్గర ప్రదర్శనకు ఉంచారు.