Blue Aadhaar Card: బ్లూ ఆధార్ కార్డు ఎవరికిస్తారు?
Blue Aadhaar Card: భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఉంటుంది. అయితే.. మన ఆధార్ కార్డు తెల్ల రంగులో ఉంటుంది. మరి బ్లూ ఆధార్ కార్డు గురించి ఎప్పుడైనా విన్నారా? అసలు ఈ బ్లూ ఆధార్ కార్డు ప్రత్యేకత ఏంటి? ఇది ఎవరికి ఇస్తారు?
ఈ బ్లూ ఆధార్ కార్డుని ఐదేళ్ల లోపు చిన్నారులకు ఇస్తారు
ఈ ఆధార్ కార్డుకి కూడా 12 డిజిట్ల యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. కానీ మనలాగా పిల్లలకు ఫింగర్ ప్రింట్ స్కానింగ్ అవసరం ఉండదు.
ఈ ఆధార్ కార్డు రావాలంటే బర్త్ సర్టిఫికేట్ కానీ హాస్పిటల్ డిశ్చార్జి స్లిప్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది
శిశువు తల్లిది కానీ తండ్రిది కానీ ఆధార్ కార్డు కూడా చూపించాలి
మీ పిల్లలకు ఐదేళ్లు నిండాక సాధారణ ఆధార్ కార్డును దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు వారి బయోమెట్రిక్ డేటా అవసరం పడుతుంది.
అలాగని ఐదేళ్లు నిండాక ఆధార్ కార్డు నెంబర్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఆల్రెడీ ఇచ్చిన నెంబరే వర్తిస్తుంది.