Uttarpradesh: వణికించిన డబుల్ మర్డర్.. ఏం జరిగింది?
Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం జరిగిన డబుల్ మర్డర్ ఘటనతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అభంశుభం తెలీని ఇద్దరు చిన్నారలను ఓ క్షవరకుడు దారుణంగా చంపి పరారయ్యాడు. మరో బాలుడిని కూడా చంపబోతుంటే అతను పారిపోయి ప్రాణాలను కాపాడుకున్నాడు.
అసలు ఈ మర్డర్ ఎలా జరిగింది?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదౌన్ ప్రాంతానికి చెందిన సాజిద్ అనే వ్యక్తి ఓ సెలూన్ షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు. సాజిద్ షాప్ ముందే వినోద్ తన భార్య సంజన, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అయితే సాజిద్ నిన్న ఉదయం వినోద్ ఇంటికి వెళ్లాడు. తన భార్యకు డెలివరీ ఉందని అర్జెంట్‌గా రూ.5000 కావాలని అడిగాడు. అప్పటికే వినోద్ ఏదో పని మీద బయటకు వెళ్లడంతో సంజన వినోద్‌కి ఫోన్ చేసింది. దాంతో వినోద్ సాజిద్‌కు రూ.5000 ఫోన్ పే చేసాడు.
ఆ తర్వాత సంజన టీ తెస్తానని లోపలికి వెళ్లింది. అప్పుడు సంజన పెద్ద కుమారుడు ఆయుష్‌ని సాజిద్ పిలిచి పైన ఉన్న మీ అమ్మ పార్లర్‌ను చూపించే అని అడిగాడు. ఇందుకు ఆయుష్ సరే అని పైకి తీసుకెళ్తుండగా.. ఉన్నట్టుండి సాజిద్ లైట్లు ఆపేసి ఆయుష్ పీక కోసేసాడు. అరుపులు విన్న రెండో కుమారుడు అహాన్ వెళ్లి చూడగా.. సాజిద్ ఆయుష్ పీక కోస్తూ కనిపించాడు. అహాన్‌ని చూసిన సాజిద్ అతన్ని కూడా కత్తితో పొడిచి చంపేసాడు. ఇక మూడో కుమారుడు పీయుష్‌ని కూడా చంపబోతుంటే తప్పించుకుని తన తల్లి వద్దకు వెళ్లాడు. ఈ దారుణ ఘటనలో ఆయుష్, అహాన్‌లు అక్కడికక్కడే మరణించారు. పీయుష్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. (Uttarpradesh)
శతృత్వమే లేదు
అయితే తనకు సాజిద్‌కి మధ్య ఎలాంటి శతృత్వం లేదని వినోద్ చెప్తున్నాడు. డబ్బులు అడిగితే సాయం చేసానని.. కంగారుపడుతుంటే ఏమీ కాదని ధైర్యం కూడా చెప్పానని వినోద్ తెలిపాడు. మర్డర్‌కు పాల్పడిన తర్వాత బయటే సాజిద్ సోదరుడు జావేద్ బైక్‌పై ఎదురుచూస్తున్నాడు. సాజిద్ రాగానే బైక్ ఎక్కించుకుని పరారయ్యాడు. సాజిద్ ఆచూకీ తెలీడంతో పోలీసులు అతన్ని వెండిస్తుండగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సాజిద్ మృతిచెందాడు. దాంతో పోలీసులు జావేద్ కోసం గాలిస్తున్నారు.