Naresh Goyal: అమ్మ ఇచ్చిన డబ్బుతో వ్యాపారం.. చివరికి
చిన్నప్పుడే తండ్రి చనిపోతే అమ్మ, మేనమామ గారాభంగా పెంచారు. కోరుకున్నది చదువుతానంటే చదివించారు. అలా ఎయిర్‌లైన్స్‌కి సంబంధించిన అన్ని విషయాల్లో పట్టు సాధించి.. తల్లి నుంచి 500 పౌండ్లు (దాదాపు 50,000) తీసుకుని జెట్ ఎయిర్‌వేస్ (jet airways) ప్రారంభించారు. ఇప్పుడు రూ.538 కోట్లు లోన్ కుంభకోణంలో జైలు పాలయ్యారు. ఇది జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ (naresh goyal) కథ.
కెనరా బ్యాంక్ (canara bank) నుంచి రూ.538 కోట్ల వరకు లోన్ తీసుకుని ఎగ్గొట్టిన కేసులో రెండు రోజుల క్రితం దాదాపు 9 గంటల పాటు విచారించిన ఈడీ (ed).. నరేష్ దోషి అని తేలడంతో వెంటనే అరెస్ట్ చేసింది. మే 3న కెనరా బ్యాంక్… నరేష్ గోయల్, అతని భార్య అనిత, కంపెనీకి చెందిన కొందరు అధికారులపై కేసు వేసింది. జెట్ ఎయిర్‌వేస్ తమ నుంచి మొత్తం రూ.848 కోట్లు లోన్ తీసుకుందని కానీ ఇప్పటివరకు రూ.300 కోట్ల వరకు మాత్రమే లోన్ క్లియర్ చేసి మిగతా రూ.500 కోట్లు ఎగ్గొట్టిందని పేర్కొంది. దీనిపై CBI FIR నమోదు చేసింది. కొంతకాలంగా అందరినీ విచారణ చేస్తూ వస్తోంది. (naresh goyal)
జులై 2021లో జెట్ ఎయిర్‌వేస్‌కు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ ఫ్రాడ్ అని తెలిసింది. 2011 నుంచి 2019 వరక జెట్ ఎయిర్‌వేస్ రూ.1,152 కోట్లు ఖర్చు చేసినట్లు తేలింది. రూ.197 కోట్ల వరకు అనుమానిత లావాదేవీలు జరిగినట్లు CBI గుర్తించింది. జెట్ ఎయిర్‌వేస్ ఖర్చు చేసిన రూ.1,152 కోట్లలో రూ.420 కోట్ల వరకు కన్‌సల్టెన్సీలకు ఇచ్చింది. కానీ ఆ బిల్లులలో ఆ కన్‌సల్టెన్సీలకు ఎయిర్‌లైన్స్ వ్యవస్థకు ఎలాంటి సంబంధం లేదని తేలింది. అంతేకాదు.. .జెట్ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల పర్సనల్ ఖర్చులు కూడా సంస్థే పెట్టుకుందట.
మే 5న ఎయిర్‌వేస్‌కు సంబంధించిన ఆఫీస్‌లు, ఉద్యోగుల ఇళ్లల్లో CBI రైడ్లు చేసింది. జులైలో నరేష్ గోయల్‌కు సంబంధించిన దాదాపు 8 ప్రదేశాల్లో రైడ్లు జరిగాయి. అలా మొన్న శుక్రవారం ఈడీ నరేష్ గోయల్‌ను విచారణకు పిలిచింది. విచారణలో నరేష్ ఫ్రాడ్‌కి పాల్పడినట్లు తేలడంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఒకప్పుడు ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ క్యారియర్ ఎయిర్‌లైన్స్ అయిన జెట్ ఎయిర్‌వేస్.. 2019లో దివాలా తీసింది. అప్పులు పెరిగిపోయి జీతాలు ఇచ్చుకోలేని స్థితికి చేరుకుంది. 2021లో ఈ ఎయిర్‌లైన్స్‌ను దుబాయ్, లండన్‌కు చెందిన వ్యాపారవేత్తలు ఒప్పందం కుదుర్చుకుని కొనుగోలు చేసారు. (naresh goyal)