Deepti Case: దీప్తిని నేను చంపలేదు.. వాయిస్ మెసేజ్ వైరల్
కోరుట్లకు (korutla) చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దీప్తి హత్య కేసులో (deepti case) ఎన్నో షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం దీప్తి మృతదేహం లభించగా.. ఆమె చెల్లెలు చందన కనిపించకుండాపోయింది. దాంతో దీప్తిని చంపింది చందననే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో చందన తన తమ్ముడు సాయికి ఓ వాయిస్ మెసేజ్ పంపింది. దీప్తిని తాను చంపలేదని తెలిపింది. ఆ వాయిస్ మెసేజ్ ఇలా ఉంది…
“” అరేయ్ సాయి నేను చందక్కనురా.. నిజమెంటో చెప్పాలారా. దీప్తి అక్క నేను తాగుదామనుకున్నాం. కానీ, నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను నా ఫ్రెండ్ చేత మందు తెప్పించా. అది నేను ఒప్పుకుంటా. కానీ అక్కనే తాగింది. తాగిన తర్వాత తన బాయ్ ఫ్రెండ్‌ని పిలుస్తా అంది. నేను వద్దన్నా.. అయినా పిలుస్తా అంటే చివరికి నీ ఇష్టం సరే అన్నా.
నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నా. ఇది నిజం. అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా. అక్క హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫోన్ మాట్లాడి.. సోఫాలో పడుకుంది. రెండుసార్లు లేపాను. సరే పడుకుందని డిస్టర్బ్ చేయొద్దని వెళ్లిపోయా. ఛాన్స్ దొరికిందని వెళ్లిపోయా. నా తప్పేం లేదు సాయి. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు.. నన్ను నమ్ము సాయి, నా తప్పేం లేదు ప్లీజ్ నమ్మరా. మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయా. ఇలా అవుతుంది అనుకోలేదు. అక్కను నేనెందుకు మర్డర్ చేస్తాను “” అని ఉంది. అయితే దీప్తి ఎలా చనిపోయిందో తెలియాలంటే పోస్ట్‌మార్టెం నివేదిక వస్తే కానీ చెప్పలేం అని పోలీసులు తెలిపారు. (deepti case)
జరిగిన ఘటన
కోరుట్లకు చెందిన శ్రీనివాస్ రెడ్డి, మాధవి దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద అమ్మాయి పేరు దీప్తి, రెండో అమ్మాయి చందన మూడో బిడ్డ పేరు సాయి. దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం కావడంతో దీప్తి ఇంట్లోనే ఉంటోంది. చందన బీటెక్ చదువుతోంది. సాయి బెంగళూరులో చదువుకుంటున్నాడు. ఆదివారం శ్రీనివాస్ రెడ్డి, మాధవి కలిసి బంధువుల ఇంట్లో గృహప్రవేశం ఉందని వెళ్లారు. ఇంట్లో దీప్తి, చందన మాత్రమే ఉన్నారు. ఆ రోజు రాత్రి కూతుళ్లతో మాట్లాడిన తర్వాత మరుసటి రోజు మాత్రం ఇద్దరి ఫోన్లు స్విచ్ఛాఫ్ వచ్చాయి. దాంతో కంగారుపడ్డ శ్రీనివాస్ దంపతులు పక్కింటివారికి ఫోన్ చేసి ఒకసారి వెళ్లి చూడమని చెప్పారు. ఇంట్లో దీప్తి మృతదేహాన్ని చూసి షాకయ్యారు. ఆసమయంలో అక్కడ ఎవ్వరూ లేరు.
ఇదిలా ఉండగా.. అదే రోజు చందన కనిపించకుండాపోయింది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ప్రకారం.. ఓ అబ్బాయితో కలిసి చందన బస్ స్టాప్‌లో వెయిట్ చేస్తూ నిజామాబాద్ వెళ్లే బస్సు ఎక్కింది. దాంతో పోలీసులు చందన, ఆమెతో పాటు ఉన్న యువకుడి కోసం గాలిస్తున్నారు. (deepti case)