జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డుల్లో మార్పులు ఇవే

what are the new rules in aadhaar card and driving license

Viral News:  జూన్ 1 నుంచి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్పీజీ గ్యాస్ సిలిండ‌ర్ల విష‌యంలో ప‌లు మార్పులు అమ‌ల్లోకి రాబోతున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్

సాధార‌ణంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే ముందు డ్రైవింగ్ టెస్టుల‌ను ఆర్టీవో కార్యాల‌యాల్లో చేస్తుంటారు. జూన్ 1 నుంచి ఆ అవ‌స‌రం లేదు. ప్రైవేట్ డ్రైవింగ్ ట్రైనింగ్ సెంట‌ర్ల నుంచి కూడా లైసెన్స్ తీసుకోవ‌చ్చు.

కాలుష్యాన్ని నియంత్రించేందుకు దాదాపు 900,000 వాహ‌నాల‌ను తొల‌గించ‌నున్నారు. కార్ల‌కు సంబంధించిన‌ ఎమిష‌న్ రెగ్యులేష‌న్స్‌ను క‌ఠిన‌త‌రం చేయ‌నున్నారు.

లిమిట్‌ను దాటి అతివేగంగా వెళ్లే వాహ‌నాల‌కు రూ.1000 నుంచి రూ.2000 వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు.

మైన‌ర్లు వాహ‌నాలు న‌డుపుతూ దొరికితే రూ.25,000 జ‌రిమానా క‌ట్టాల్సి ఉంటుంది. ఆ కారు రిజిస్ట్రేష‌న్ కార్డు క్యాన్సిల్ అవుతుంది. ప‌ట్టుబ‌డిన మైన‌ర్‌కు 25 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు లైసెన్స్ రాదు.

ఆధార్ కార్డు కొత్త రూల్స్

ఆధార్ కార్డులో వివ‌రాలు అప్డేట్ చేసుకునేందుకు జూన్ 14 వ‌ర‌కు స‌మ‌యం ఉంది.

జూన్ 14 త‌ర్వాత ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో అప్డేట్ చేసుకుంటే రూ.50 రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

మే 31లోపు ఆధార్ కార్డు ప్యాన్ కార్డు లింక్ చేయ‌క‌పోతే ప‌న్ను క‌ట్టేవారికి అధిక TDS ప‌డుతుంద‌ని ఐటీ శాఖ హెచ్చరించింది.

LPG సిలిండ‌ర్ స్కీంలో కొత్త మార్పులు

ప్ర‌తి నెల ఒక‌టో తేదీన LPG సిలిండ‌ర్ ధ‌ర‌ల్లో స‌డ‌లింపు ఉంటుంది.

జూన్ 1 నుంచి చ‌మురు కంపెనీలు గ్యాస్ సిలిండ‌ర్ల‌పై ధ‌ర‌ల‌ను నిర్ణ‌యిస్తాయి. ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గే అవ‌కాశం ఉంది.

జూన్‌లో బ్యాంక్ సెల‌వులు

జూన్‌లో దాదాపు ప‌ది రోజుల పాటు బ్యాంకులు మూసేసి ఉంటాయి. వీటిలో ఆదివారాలు, రెండు, నాలుగు శ‌నివారాలు, రాజ సంక్రాంతి, ఈద్ ఉల్ దుహా స‌మ‌యాల్లో బ్యాంకులు మూసేసి ఉంటాయి.