Live In Relationship: ఇదెక్కడి దరిద్రపు బంధం..!
ప్రతి మాసానికి పార్ట్‌నర్‌ను మార్చే సహజీవన బంధాలపై (live in relationship) మండిపడింది అలహాబాద్ హైకోర్టు (allahabad high court). ఈ దరిద్రపు బంధం సమాజానికి అస్సలు మంచిది కాదని తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని షహారన్‌పూర్‌కి చెందిన 19 ఏళ్ల యువతి.. అద్నాన్ అనే యువకుడితో సహజీవనం చేసేది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆ యువతిని గర్భవతిని చేసాడు. ఆ తర్వాత ముఖం చాటేసాడు. దాంతో ఆమె కోర్టుకెక్కింది. ఈ కేసును పరిశీలించిన అలహాబాద్ హైకోర్టు సహజీవన పద్ధతిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సహజీవనం అనేది దేశంలోని వైవాహిక బంధాన్నే చెడగొట్టేలా ఉందని తెలిపింది. ఇద్దరు వ్యక్తులకు వివాహం ఇచ్చే ధైర్యం, నిబద్ధత.. ఈ సహజీవన పద్ధతులు ఇవ్వలేమని తెలిపింది. (live in relationship)
“” ఇతర దేశాల్లో మాదిరిగా.. మన దేశంలోనూ వైవాహిక బంధం అంతరించిపోతే అప్పుడు ఈ సహజీవన పద్ధతులను పాటించవచ్చు. పెళ్లయ్యాక పార్ట్‌నర్‌తో సెక్స్ చేయకపోవడం.. సహజీవనంలో సెక్స్ కానిచ్చేయడం వంటి అంశాలను సమాజం అభివృద్ధికి నిదర్శనం అని అనుకుంటున్నారు. ఇలాంటి పద్ధతుల్లో మనం భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నాం “” అని కోర్టు వెల్లడిస్తూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.