West Bengal జైళ్లలో పాడుపని.. గర్భం దాలుస్తున్న ఖైదీలు
West Bengal: వెస్ట్ బెంగాల్లో ఉన్న దాదాపు అన్ని జైళ్లల్లో ఖైదీలు గర్భం దాలుస్తున్న ఘటన సంచలనంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు అన్ని జైళ్లలోని అధికారులు మహిళా ఖైదీలతో రాసలీలలు కొనసాగిస్తున్నారు. ఇందుకోసం పని పూర్తయ్యేంత వరకు బయట మరో అధికారిని కాపలాగా పెడుతున్నారట. ఫలితంగా దాదాపు 196 మంది ఖైదీలు బిడ్డలకు జన్మనివ్వడం ఆ రాష్ట్రంలో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ విషయం కాస్తా కలకత్తా హైకోర్టు వరకు చేరడంతో వివాదాస్పదంగా మారింది. ఈ అంశంపై ఇద్దరు న్యాయమూర్తులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపి త్వరలో రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు.
వెస్ట్ బెంగాల్ జైళ్లలో వారానికి ఒక కొత్త మహిళా ఖైదీ ఎంట్రీ అవుతోంది. ఆల్రెడీ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీలు ఎవరు కొత్తగా వచ్చారు.. ఎవరు ఎలాంటి నేరాలు చేసారు వంటి వివరాలు సేకరించి సెక్యూరిటీ గార్డులు, జైలర్లు, ఇతర అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అలా కొత్తగా వచ్చినవారి నుంచి ఎప్పటినుంచో జైల్లో ఉంటున్నవారితో ప్రొటెక్షన్ లేకుండా శృంగారం చేసి వెళ్లిపోతున్నారట. తమకు అన్ని రకాలుగా సహకరిస్తున్నందుకు వారికి డబ్బులు ఇవ్వడం, కుటుంబ సభ్యులతో మాట్లాడుకోమని ఫోన్లు ఇవ్వడం వంటి పనులు చేస్తున్నారట. ఇలాంటి నీచమైన ఘటనలకు అడ్డు కట్ట వేసేందుకు మహిళా ఖైదీలు ఉండే జైళ్ల వద్ద మహిళా సెక్యూరిటీనే నియమించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మహిళా ఖైదీలు ఉన్న ప్రదేశంలో మగవారిని అనుమతించకూడదని హెచ్చరించింది.
ఒకే నెలలో వెస్ట్ బెంగాల్లోని ఓ జైలులో దాదాపు పది మంది ఖైదీలు గర్భం దాల్చడంతో అధికారులు కూడా షాకయ్యారు. ఇదేం పాడుపని అని హెచ్చరించి వార్నింగ్తో వదిలేసారు. ఈ విషయం బయటికి తెలిస్తే తమ పరువు పోతుందని దాచిపెట్టారు. కానీ బెంగాల్లోని దాదాపు అన్ని జైళ్లల్లో ఇదే పరిస్థితి ఉండటంతో విషయం దాగలేదు. మరో షాకింగ్ అంశం ఏంటంటే.. మగ ఖైదీలు కూడా తమ అవసరాన్ని తీర్చాలని జైల్లోని భద్రతా సిబ్బందిని అడుగుతున్నారట. తమకు కూడా ఛాన్స్ ఇవ్వాలని కోరినప్పుడు ఇవ్వకపోతే వారి విషయాలు అధికారులు వచ్చినప్పుడు బయటపెడతామని బెదిరిస్తుండడంతో ఏం చేయాలో తెలీక వారిని కూడా మహిళా ఖైదీలు ఉన్న జైళ్లకు పంపిస్తున్నారట.
అయితే కొందరు మహిళా ఖైదీలు తమ కోరిక తీర్చాలని బలవంతపెడుతున్న జైలు అధికారులను దూరం పెడుతున్నప్పటికీ వారిని బెదిరించి ఇక బెయిల్ కూడా రానివ్వకుండా జైల్లోనే మగ్గేలా చేస్తామని బెదిరించి మరీ లోబర్చుకుంటున్నారట. ఈ అంశం చర్చనీయాంశంగా మారడంతో వెస్ట్ బెంగాల్లోని దాదాపు అన్ని జైళ్లలో ఉన్న మహిళా ఖైదీలకు పెగ్నెన్సీ పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మరోపక్క గర్భం దాల్చిన ఖైదీల్లో అనారోగ్య సమస్యలు ఉంటే వారిని జైలు నుంచి కరెక్షనల్ హోంకు తరలిస్తున్నారట. వారికి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదన్నా జరిగి మరణిస్తే కస్టడీ డెత్ కింద కొత్త తలనొప్పి మొదలవుతుందని జైలు అధికారులు టెన్షన్ పడుతున్నారు.