ఇక మనకు 24 గంటలు కాదు.. 25 గంటలు.!
Viral News: మనకు రోజులో 24 గంటలు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇక నుంచి 24 గంటలు కాదు.. 25 గంటలు ఉండబోతున్నాయి. ఇందుకు కారణం చంద్రుడు మెల్లిగా భూమి నుంచి దూరంగా జరిగిపోతున్నాడట. ఏడాదికి 3.82 సెంటీమీటర్ల మేర చంద్రుడు భూమి నుంచి దూరంగా జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇలా చంద్రుడు జరిగిపోతుండడం వల్ల మనకు పగలు నిడివి పెరుగుతుంది. ఈ ప్రక్రియ కాస్త నిదానంగా సాగుతున్నప్పటికీ రానున్న ఏళ్లల్లో రోజులో 25 గంటలు ఉంటాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చంద్రుడికి భూమికి మధ్య ఏర్పడిన బంధం 1.4 బిలియన్ సంవత్సరాల క్రితంది. విస్కన్సిన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ భూమి, చంద్రుడి మధ్య ఉన్న సంబంధం గురించి వివిధ పరిశోధనలు చేస్తుంటే చందమామ మనకి దూరంగా వెళ్లిపోతున్నట్లు తేలింది.