Watermelon: ఆ దేశంలో వాటంతట అవే పగిలిపోతున్నాయ్!
ఇదేం వింత. పుచ్చకాయను (watermelon) గట్టిగా నేలకేసి కొడితే కానీ పగలదు. అలాంటిది అగ్రరాజ్యం అమెరికాలో (america) వాటంతట అవే పగిలిపోతున్నాయట. దాంతో అమెరికన్లు భయాందోళనలకు గురవుతున్నారు. పుచ్చకాయలు వాటంతట అవే పేలిపోవడం, వాటి నుంచి నురగ రావడం వంటివి జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు పెడుతున్నారు. పుచ్చకాయ పంటల్లో ఒక విధమైన బ్యాక్టీరియా పెరుగుతోందని దాని వల్లే పుచ్చకాయలు ఇలా వాటంతట అవే పేలిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ బ్యాక్టీరియాలో పుచ్చకాయల్లో ఉండే నేచురల్ షుగర్‌తో కలిసిపోయి పులిసిపోయి అలా పగిలిపోతున్నాయట. వర్షాకాలంలో ఈ రకమైన బ్యాక్టీరియా పండ్లలోకి చొరబడటం ఇంకా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. (watermelon)