Virat Kohli: ఆ జెర్సీ ప్రైవేట్‌గా కూడా ఇవ్వ‌చ్చు .. అక్ర‌మ్‌ కామెంట్స్

నిన్న జ‌రిగిన ఇండియా పాకిస్థాన్ (india pakistan match) మ్యాచ్ అనంతరం.. పాకిస్థాన్‌ను ఓడించిన త‌ర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. (virat kohli) పాకిస్థాన్ స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజాంతో (babar azam) గ్రౌండ్‌లోనే ప‌బ్లిక్‌గా కాసేపు మాట్లాడాడు. ఆ త‌ర్వాత సంత‌కం చేసిన జెర్సీని బాబ‌ర్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీనిపై పాక్ మాజీ క్రికెట‌ర్ వ‌సీం అక్రమ్ (wasim akram) మండిప‌డ్డారు. ఈ ముచ్చ‌ట్లు.. జెర్సీలు ఇచ్చిపుచ్చుకోవ‌డాలు ప్రైవేట్‌గా డ్రెస్సింగ్ రూంలో కూడా చేసుకోవ‌చ్చు క‌దా అని కామెంట్స్ చేసారు. మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. కనీసం 200 స్కోర్ కూడా చేయ‌లేని పాక్‌.. ఆట అయిపోయాక ప్ర‌త్య‌ర్ధి క్రికెట‌ర్ల‌తో ముచ్చ‌ట్లు పెట్టుకోవ‌డం జెర్సీలు ఇచ్చిపుచ్చుకోవ‌డం వంటివి చేసి ఫ్యాన్స్‌ను మ‌రింత రెచ్చ‌గొడుతున్నార‌ని అక్ర‌మ్ అభిప్రాయ‌ప‌డ్డారు.