Viral News: ఫోన్ పక్కనపెట్టండి.. రూ.8 లక్షలు గెలుచుకోండి
Viral News: తిండి లేకపోయినా ఉంటాం కానీ చేతిలో ఫోన్ లేకపోతే ఈ రోజుల్లో అస్సలు ఉండలేరు. ఈ వీక్‌నెస్‌ని పట్టుకుని ఓ కాంపిటీషన్ ఏర్పాటుచేసింది ఐస్‌ల్యాండ్‌కి చెందిన సిగ్గీ అనే కంపెనీ. ఈ సంస్థ యోగర్ట్‌ను తయారుచేసి అమ్ముతూ ఉంటుంది. ఈ సిగ్గీ సంస్థ ఒక కాంపిటీషన్ ఏర్పాటుచేసింది. ఎవరైతే నెల రోజుల పాటు ఫోన్లకు దూరంగా ఉంటారో వారికి 10వేల డాలర్లు అంటే దాదాపు రూ.8 లక్షల వరకు రివార్డు ఇవ్వనుంది.
ప్రోగ్రామ్ పూర్తయ్యాక 10 మంది లక్కీ విన్నర్లకు బోలెడు గిఫ్ట్స్ కూడా ఇస్తుంది. ఈ పోటీలో దాదాపు 50 దేశాలకు చెందిన వారు పాల్గొనవచ్చు. పాల్గొనాలనుకునేవారు సిగ్గీ డిజిటల్ డిటాక్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి అప్లికేషన్ ఫాం ఫిల్ చేయాల్సి ఉంటుంది. జనవరి 31లోపు ఈ ఫామ్ సబ్మిట్ చేయాలి. ఒక్కొక్కరు ఒకసారే ఫాం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెండు సార్లు చేస్తే వారిని పోటీ నుంచి తప్పిస్తారు.
పోటీలో పాల్గొనేవారికి కావాల్సినవన్నీ సమకూరుస్తారు. ఒక్క ఫోన్ తప్ప. ఇంతకీ ఈ పోటీ ఎందుకు పెడుతున్నారంటే.. ఈరోజుల్లో ఫోన్ల వాడకం విపరీతంగా పెరిగిపోయి అసలు ప్రపంచం అంటే ఏంటో తెలీకుండాపోతున్న యువత ఎందరో ఉన్నారు. అలాంటివారికి నెల రోజుల పాటు ఫోన్ వాడకపోతే జీవితం ఎలా ఉంటుందో చూపించడానికే సిగ్గీ సంస్థ ఈ పోటీని పెడుతోంది. ఈ పోటీలో పాల్గొనేవారి వయసు 18 నిండి ఉండాలి.